AP High Court Recruitment : 119 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తులు ప్రారంభం

AP High Court Civil Judge Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఖాళీల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అక్టోబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

Published on: Oct 4, 2026, 06:57:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP High Court Civil Judge Recruitment 2026 : న్యాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకుని జడ్జి కావాలనుకునే లా గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది.ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

మొత్తం 119 ఖాళీలు…

మొత్తం భర్తీ చేయనున్న 119 ఖాళీలను రెండు విధానాల ద్వారా నింపనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 96 పోస్టులు, రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ కింద 23 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతన శ్రేణి వర్తిస్తుంది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు 01.09.2026 నాటికి 35 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 48 ఏళ్లుగా నిర్ణయించారు.

సెలెక్షన్ ప్రాసెస్....

ఈ జుడీషియల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా మూడు దశల్లో నిర్వహిస్తారు.

  • స్క్రీనింగ్ టెస్ట్: 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత (CBT) మల్టిపుల్ ఛాయిస్ పరీక్ష ఉంటుంది. ఇందులో 40% కనీస అర్హత మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ప్రధాన రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • మెయిన్స్ : మొత్తం 3 పేపర్లు ఉంటాయి (ప్రతి పేపర్‌కు 100 మార్కులు, సమయం 3 గంటలు). పేపర్-I సివిల్ లాస్, పేపర్-II క్రిమినల్ లాస్, పేపర్-III కింద ఇంగ్లీష్ - అనువాదం మరియు వ్యాస రచన ఉంటుంది.
  • మౌఖిక పరీక్ష : రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారిని 1:3 నిష్పత్తిలో 50 మార్కుల ఇంటర్వ్యూకి పిలుస్తారు.

ఎంపికైన అభ్యర్థులను "ట్రైనీ జుడీషియల్ ఆఫీసర్లు"గా నియమించి జుడీషియల్ అకాడమీలో ఏడాది పాటు నిరంతర శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరొక సంవత్సరం పాటు లా క్లర్క్‌‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తయ్యాక మాత్రమే రెగ్యులర్ సివిల్ జడ్జిగా విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.10.2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 26.10.2026 (రాత్రి 11:59 గంటల వరకు)
  • అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 గా నిర్ణయించారు.
  • అధికారిక వెబ్‌సైట్ - https://aphc.gov.in

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More