తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు తేదీలు ఇవే.. ఫీజు వివరాలు
తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించింది. జులై 29న ఈ ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అభ్యర్థులు కేవలం టీఎస్‌ఎల్‌పిఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో నిర్దేశించిన వన్-టైమ్ ఫీజు అభ్యర్థన ప్రాసెసింగ్, ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి మొత్తం ప్రక్రియకు వర్తిస్తుంది.
సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్‌ప్రింట్ బ్యూరో), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) వంటి సాంకేతిక పోస్టులకు కూడా ఇదే విధమైన రుసుములు వర్తిస్తాయి. అర్హత కలిగిన పోస్టులకు ప్రాక్టికల్, ట్రేడ్, డ్రైవింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాలనే వారు దరఖాస్తు చేసుకున్న అన్ని పోస్టులకూ పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్ దరఖాస్తులో పార్ట్-1 సమర్పించే ముందు, ఆధార్ ఆధారిత ముఖ ప్రమాణీకరణ పూర్తి చేయడానికి అభ్యర్థులు తమ మొబైల్‌లో Aadhaar యాప్‌ను డెమో డెవలప్‌మెంట్స్ లేదా స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది.
దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి. సందేహాలు లేదా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


