Tirupati SIHM Admissions 2026 : హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
Tirupati SIHM Admissions : తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్, పదో తరగతి అర్హత ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
Tirupati SIHM Admissions 2026 : ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ) ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న వేళ…. ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (SIHM) మంచి అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ వివరాలను వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ, నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందిస్తోంది. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇక్కడ కోర్సులను రూపొందించారు.
- బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ : ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసిన వారు ఈ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ : పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఏడాదిన్నర (1.5 ఏళ్లు) వ్యవధి గల ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పరిశ్రమ శిక్షణ – ఉద్యోగ అవకాశాలు:
కేవలం తరగతి గది విద్యకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం అందించడానికి ఈ కోర్సుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. అందులో భాగంగా విద్యార్థులకు 17 వారాల పాటు నేరుగా ప్రముఖ హోటల్ పరిశ్రమల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తారు.
ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే దేశ విదేశాల్లోని ప్రముఖ స్టార్ హోటళ్లు, హాస్పిటాలిటీ గ్రూపులలో అత్యుత్తమ వేతనాలతో స్థిరపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
దరఖాస్తు విధానం….
ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాల అధికారిక వెబ్‌సైట్ www.sihmtpt.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నేరుగా తిరుపతిలోని కళాశాల ప్రాంగణానికి వెళ్లి కూడా అప్లికేషన్లు సమర్పించవచ్చు.
- ఫోన్ నంబర్లు: 97013 73846, 97004 40604
- ఇ-మెయిల్: sihmtpt@gmail.com
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

