...
...
Next Story

AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు, ఈనెల 7న సీట్ల కేటాయింపు

AP ICET 2026 Counselling : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఐసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. అర్హులైన వాళ్లు వెంటనే కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Published on: Sep 2, 2026, 13:58:08 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అర్హులైన అభ్యర్థులు తమకు కావలసిన కళాశాలలను ఎంచుకోవడానికి ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంకా ఆప్షన్లు నమోదు చేసుకోని విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ( https://cap.apcfss.in/ ) ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది.

ఏపీ ఐసెట్ 2026 కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు
ఏపీ ఐసెట్ 2026 కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు

వెబ్ ఆప్షన్లను ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు తమ ప్రాధాన్యతల్లో ఏవైనా మార్పులు లేదా సవరణలు చేసుకోవాలనుకుంటే ఉన్నత విద్యామండలి వారికి ప్రత్యేకావకాశం కల్పించింది. సెప్టెంబర్ 3న ఒక్క రోజు మాత్రమే ఆప్షన్ల మార్పుచేర్పులకు అనుమతినిస్తారు.

ఈనెల 7న సీట్ల కేటాయింపు…

అభ్యర్థులు ఐసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ర్యాంకు, వారి సామాజిక వర్గాల రిజర్వేషన్లు మరియు వెబ్ ఆప్షన్లలో ఇచ్చే ప్రాధాన్యతల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 7వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.

సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై తమ అసలు సర్టిఫికెట్లను సమర్పించి రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల విభాగం ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లోనూ సెప్టెంబర్ 8 నుంచే నూతన విద్యాసంవత్సరం (2026-27) తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks