America Road Accident : అమెరికాలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి

America Road Accident : తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీరంతా ఇటీవలే ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లారు.

Published on: Aug 26, 2026, 14:02:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్‌గా గుర్తించారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

రాహుల్‌తోపాటు మిగిలిన ఇద్దరు కూడా ఉన్నత విద్య కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫ్లోరిడా అధికారులు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాహుల్ అకాల మరణం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త రాహుల్ స్వగ్రామంలోనూ విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు

హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలో ఒక విదేశీయుడి ప్రాణాలను సైఫాబాద్ పోలీసులు కాపాడారు. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో నివసిస్తున్న సుడాన్ దేశస్తుడైన నాజర్ ఆడమ్ బడా వేగా (25) అనే యువకుడు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సైఫాబాద్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించారు. సమయస్ఫూర్తితో తాడు సహాయంతో నీటిలోకి విసిరి, అతడిని సురక్షితంగా బయటకు తీశారు.

సకాలంలో రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అనంతరం ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన సైఫాబాద్ పోలీసులు, తదుపరి చర్యల నిమిత్తం కేసును లేక్ పోలీసులకు అప్పగించారు. సదరు విదేశీ యువకుడు ఆత్మహత్యకు పూనుకోవడానికి గల ఆర్థిక, వ్యక్తిగత లేదా మానసిక కారణాలపై లేక్ పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More