August 2026 car discounts : కొత్త కారు కొనాలా? వీటిపై భారీ డిస్కౌంట్లు! ఇంకొన్ని రోజులే ఛాన్స్..
ఆగస్టు 2026లో కొత్త కార్ల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. టాటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా బ్రాండ్ల కార్లపై లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
కొత్త కార్లు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు 2026 ఆగస్టు నెలలో వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు. బెనిఫిట్స్‌ని ప్రకటించాయి. ముఖ్యంగా టాటా హారియర్ ఈవీ, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లపై లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. కస్టమర్ల అర్హతను బట్టి రోడ్-టాక్స్ మినహాయింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు, లాయల్టీ స్కీమ్‌లు వంటి విభిన్న ఆఫర్ల ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు అన్నీ కస్టమర్ అర్హత, వేరియంట్, డీలర్‌షిప్, లొకేషన్‌ను బట్టి మారుతుంటాయి.

ఈ నేపథ్యంలో వివిధ ఆటోమొబైల్ సంస్థలు, అవి ప్రకటించిన ఆఫర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ ఆగస్టు ఆఫర్లు..
ఈ జాబితాలో ఉన్న మోడళ్లలో టాటా హారియర్ ఈవీపై అత్యధికంగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. 'ఫ్రీడమ్ సెలబ్రేషన్' ఆఫర్ కింద రూ. 1 లక్ష వరకు, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ. 75,000 స్క్రాపేజ్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. ఇప్పటికే టాటా ఈవీలు ఉన్నవారికి రూ. 1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్ అందుబాటులో ఉంది. అదే సమయంలో సాధారణ టాటా ఐసీఈ కార్ల యజమానులకు రూ. 50,000 వరకు అర్హత ఉంది. అన్ని నిబంధనలకు సరిపోయే అర్హత కలిగిన టాటా ఈవీ కస్టమర్లకు ఈ ప్రయోజనాలన్నీ కలిపి మొత్తం రూ. 3.25 లక్షల వరకు ఆదా అవుతుంది.
సాధారణ హారియర్, సఫారీ మోడళ్లపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ. 35,000 స్క్రాపేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సియెర్రా మోడల్‌పై రూ. 30,000 స్క్రాపేజ్ డిస్కౌంట్‌తో పాటు ఐసీఈ వెర్షన్‌పై అదనపు లాయల్టీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే సియెర్రా ఈవీ వెర్షన్‌పై మాత్రం కేవలం పేర్కొన్న స్క్రాపేజ్ డిస్కౌంట్ మాత్రమే వర్తిస్తుంది, వేరే ఆఫర్లు ఏమీ లేవు.
మారుతీ సుజుకీ ఆగస్టు ఆఫర్లు..
గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌పై కూడా భారీ ఆఫర్ల ప్యాకేజీ ఉంది. కొనుగోలుదారులు రూ. 1.85 లక్షల వరకు జీరో రోడ్ ట్యాక్స్ ప్రయోజనం, ఐదేళ్ల వారంటీ పొందవచ్చు. అలాగే రూ. 30,000 నుంచి రూ. 75,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ. 45,000 స్క్రాపేజ్ బోనస్, ఎంపిక చేసిన పాత కార్లపై రూ. 30,000 అప్‌గ్రేడ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
స్మార్ట్ హైబ్రిడ్ 4x2 వెర్షన్‌పై వేరియంట్‌ను బట్టి రూ. 35,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు రూ. 15,000 నుంచి రూ. 55,000 వరకు ఉండగా, స్క్రాపేజ్, కార్పొరేట్ ప్రయోజనాలు వరుసగా రూ. 25,000, రూ. 20,000 వరకు ఉన్నాయి. ఎంపిక చేసిన జీటా, ఆల్ఫా వెర్షన్లపై కూడా ఐదేళ్ల వారంటీతో పాటు వర్తించే క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది.
బలెనో పెట్రోల్ వెర్షన్లపై రూ. 5,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్లపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు ఉన్నాయి. స్క్రాపేజ్ ద్వారా మరో రూ. 10,000 వరకు పొందవచ్చు. ఇక వ్యాగన్ ఆర్ కొనుగోలుపై రూ. 25,000 క్యాష్, ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 10,000 నుంచి రూ. 25,000, స్క్రాపేజ్ కింద రూ. 10,000, రూ. 2,500 కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
హ్యుందాయ్ ఆగస్టు ఆఫర్లు..
హ్యుందాయ్ అందించే ఆఫర్లలో భాగంగా వెన్యూ, ఎన్ లైన్ మోడళ్లపై రూ. 5,000 స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. వెర్నా మోడల్‌పై రూ. 40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటు, రూ. 25,000 స్క్రాపేజ్ లేదా రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. క్రెటాపై రూ. 50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, మరో రూ. 50,000 స్క్రాపేజ్ ద్వారా దక్కుతాయి. క్రెటా ఎలక్ట్రిక్ మోడల్‌పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, రూ. 35,000 స్క్రాపేజ్ లేదా రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
కియా ఆగస్టు ఆఫర్లు..
కియా సొనెట్ మోడల్‌పై క్యాష్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ ప్రయోజనాలు అన్నీ కలిపి రూ. 60,000 వరకు లభిస్తాయి. సైరోస్ మోడల్‌పై ఇదే విధమైన స్కీమ్‌ల ద్వారా రూ. 65,000 వరకు ఆదా చేసుకోవచ్చు. వీటికి తోడు అదనపు వారంటీ (ఎక్స్‌టెండెడ్ వారంటీ), డీలర్ స్థాయిలో ప్రత్యేక ఆఫర్లు కూడా వర్తిస్తాయి. సెల్టోస్ మోడల్‌పై రూ. 20,000 లాయల్టీ, రూ. 20,000 కార్పొరేట్ ప్రయోజనాలతో పాటు డీలర్-ఎండ్ ఆఫర్లు ఉన్నాయి.
హొండా ఆగస్టు ఆఫర్లు..
హొండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు, రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
వివిధ ఆటోమొబైల్ సంస్థలు సెప్టెంబర్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఆ పెంపునకు ముందు కారును బుక్ చేసుకునేందుకు ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


