Honda City : హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు ఇవే! ఏది వాల్యూ ఫర్​ మనీ?

Honda City facelift : కొత్త హోండా సిటీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 2026 హోండా సిటీ వేరియంట్లు, వాటి ఫీచర్లను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. వీటిల్లో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏదో కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు.. 

Published on: May 25, 2026, 12:18:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Honda City facelift new : భారత సెడాన్ మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న హోండా సిటీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), పెద్ద స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. ఈ సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇది ఎస్​వీ, వీ, జెడ్​ఎక్స్, జెడ్​ఎక్స్+ అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తోంది. ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో, 2026 హోండా సిటీలో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంటో ఇక్కడ చూసేయండి..

2026 హోండా సిటీ ఇదిగో.. (PTI)
2026 హోండా సిటీ ఇదిగో.. (PTI)

1. ఎస్​వీ వేరియంట్ (బేస్ మోడల్) – ధర: రూ. 12 లక్షలు

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​లో ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ ఇందులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను హోండా అందించింది.

కీలక ఫీచర్లు: బయో-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా.

సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, టిపిఎమ్ఎస్ (టీపీఎంఎస్).

గమనిక: తక్కువ బడ్జెట్‌లో సేఫ్టీ, స్పేస్ కోరుకునే వారికి ఇది బెస్ట్. కానీ ఇందులో అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ కనెక్టివిటీ, అడాస్ ఫీచర్లు ఉండవు.

2. వీ వేరియంట్ (బెస్ట్ వాల్యూ ఫర్ మనీ) – ధర: రూ. 13.30 లక్షలు (ఎంటీ) / రూ. 14.30 లక్షలు (సీవీటీ)

బేస్ మోడల్ కంటే ఇది చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుంది. ఈ లైనప్‌లోనే ఇది మోస్ట్ రికమండెడ్ వేరియంట్.

అప్‌గ్రేడ్స్: గ్రే-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ.

అడాస్ సూట్ (సేఫ్టీ): అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై-బీమ్ అసిస్ట్.

సీవీటీ ఆప్షన్స్: ప్యాడల్ షిఫ్టర్లు, రిమోట్ ఇంజన్ స్టార్ట్ ఫీచర్లు లభిస్తాయి.

3. జెడ్​ఎక్స్ వేరియంట్ (లగ్జరీ మోడల్) – ధర: రూ. 15.26 లక్షలు (ఎంటీ) / రూ. 16.26 లక్షలు (సీవీటీ)

ఈ హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్​ క్యాబిన్ లోపల లగ్జరీ అనుభూతిని కోరుకునే వారి కోసం ఈ వేరియంట్‌ను డిజైన్ చేశారు.

ఫీచర్లు: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, లెథరెట్ అప్హోల్‌స్టరీ, యాంబియంట్ లైటింగ్.

టెక్నాలజీ: పెద్ద 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, లేన్‌వాచ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్.

4. జెడ్​ఎక్స్+ వేరియంట్ (టాప్-ఎండ్ పెట్రోల్) – ధర: రూ. 16.15 లక్షలు (ఎంటీ) / రూ. 17.15 లక్షలు (సీవీటీ)

పెట్రోల్ మోడల్‌లో అన్ని రకాల ఫీచర్లు కావాలనుకునే వారి కోసం దీనిని రూపొందించారు.

అదనపు ఫీచర్లు: బ్లాక్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రిమోట్ ద్వారా విండోస్ అండ్ సన్‌రూఫ్ ఆపరేట్ చేసే సదుపాయం, 7-ఇంచ్ హెచ్‌డీ కలర్ డ్రైవర్ డిస్‌ప్లే.

5. జెడ్​ఎక్స్+ ఈ హైబ్రిడ్ (స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్) – ధర: రూ. 21 లక్షలు..

మైలేజ్ పరంగా రికార్డులు సృష్టించేందుకు హోండా ఈ మోడల్‌ను తెచ్చింది.

ఫీచర్లు: ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో హోల్డ్‌తో), ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఈవీ/హైబ్రిడ్ డ్రైవ్ మోడ్స్.

మైలేజ్: ఇది లీటరుకు ఏకంగా 27.26 కిమీ/ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. డైలీ రన్నింగ్ ఎక్కువగా ఉండి, మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ కానీ దీని ధర చాలా ఎక్కువ.

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్- ఇంజన్ ఆప్షన్లు, పవర్..

1.5ఎల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: 119 బీహెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్).

1.5ఎల్ స్ట్రాంగ్ హైబ్రిడ్: 125 బీహెచ్​పీ కంబైన్డ్ పవర్, 253 ఎన్​ఎం టార్క్ అందిస్తుంది. (ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది).

2026 హోండా సిటీ- ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్?

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​లోని వీ వేరియంట్​ వాల్యూ ఫర్​ మనీ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరకు, టెక్నాలజీకి, సేఫ్టీకి, రోజువారీ వినియోగాన్ని ఈ వేరియంట్ బ్యాలెన్స్​ చేస్తుందని అంటున్నారు. కానీ మీకు మంచి మైలేజ్​ కావాలనుకుంటే హైబ్రిడ్​ వేరియంట్​వైపు చూడొచ్చని సూచిస్తున్నారు.

గమనిక- పైన చెప్పినవి ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More