Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్ ఎస్​యూవీ​ టాటా నెక్సాన్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్?

Tata Nexon variant : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్, ఇప్పుడు డజన్ల కొద్దీ వేరియంట్లు, అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లలో లభించే ఈ కారు వేరియంట్ వారీగా పూర్తి సమాచారం మీకోసం..

Published on: May 13, 2026, 06:43:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tata Nexon on road price : భారత ఆటోమొబైల్ మార్కెట్​లో టాటా నెక్సాన్ ఒక సంచలనం. తనదైన భద్రతా ప్రమాణాలు, స్టైలిష్ లుక్స్‌తో ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగుతోంది. ప్రస్తుతం ఈ కారు టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జి అనే మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. మొత్తం 44 స్టాండర్డ్ వేరియంట్లు, వీటికి అదనంగా డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్లతో కస్టమర్లకు భారీ ఆప్షన్లను టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 2026లో టటా నెక్సాన్ కొనాలనుకుంటే ఏ వేరియంట్​ని ఎంచుకోవాలి? అసలు ఏ వేరియంట్​లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా నెక్సాన్ ఎస్​యూవీ..
టాటా నెక్సాన్ ఎస్​యూవీ..

టాటా నెక్సాన్ ఎస్​యూవీ- శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు..

నెక్సాన్ ఎస్​యూవీ మూడు రకాల ఇంజిన్లతో మార్కెట్​లో అందుబాటులో ఉంది:

1.2 లీటర్ టర్బో-పెట్రోల్: ఇది 120hp శక్తిని ఇస్తుంది. దీనిలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

1.2 లీటర్ సీఎన్జీ: ఇది 100hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

1.5 లీటర్ డీజిల్: 115hp శక్తిని ఇచ్చే ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తోంది.

టాటా నెక్సాన్ ఎస్​యూవీ- కలర్​ ఆప్షన్స్​..

ప్రిస్టిన్ వైట్, డేటోనా గ్రే, గ్రాస్‌ల్యాండ్ బీజ్, ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ, రాయల్ బ్లూ అనే ఆరు రంగుల్లో టాటా నెక్సాన్ లభిస్తుంది. క్రియేటివ్ ట్రిమ్ నుంచి బ్లాక్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ ఎస్​యూవీ- వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధర వివరాలు..

1. స్మార్ట్ - ధర: రూ. 7.37 లక్షల నుంచి రూ. 8.30 లక్షలు

ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ అవసరమైన ఫీచర్లు ఉన్నాయి:

ఎల్​ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్​ఎల్స్, టెయిల్ లైట్లు.

16- ఇంచ్ స్టీల్ వీల్స్ (కవర్లు ఉండవు).

మాన్యువల్ ఏసీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

స్టీరింగ్ వీల్‌పై వెలిగే టాటా లోగో.

డ్రైవ్ మోడ్స్: ఎకో, సిటీ, స్పోర్ట్స్.

భద్రత: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, ISOFIX, రియర్ పార్కింగ్ సెన్సార్లు.

2. స్మార్ట్+ - ధర: రూ. 8.07 లక్షల నుంచి రూ. 9.22 లక్షలు

(స్మార్ట్ వేరియంట్ ఫీచర్లతో పాటు అదనంగా..)

స్టీల్ వీల్స్‌కు ప్లాస్టిక్ కవర్లు.

7- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే).

4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్​వీఎంలు

ఆటోమేటిక్ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు.

3. స్మార్ట్+ ఎస్ - ధర: రూ. 8.37 లక్షల నుంచి రూ. 9.52 లక్షలు

వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన సింగిల్-పేన్ సన్‌రూఫ్.

ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రూఫ్ రైల్స్.

4. ప్యూర్+ - ధర: రూ. 8.95 లక్షల నుంచి రూ. 10.64 లక్షలు

10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే.

రియర్ పార్కింగ్ కెమెరా, షార్క్ ఫిన్ యాంటెన్నా.

4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్.

డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు చేసుకునే సౌకర్యం.

5. ప్యూర్+ ఎస్ అండ్ ప్యూర్+ పీఎస్ - ధర: రూ. 9.23 లక్షల నుంచి రూ. 11.20 లక్షలు

ప్యూర్+ ఎస్ : సన్‌రూఫ్. ఆటో హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి.

ప్యూర్+ పీఎస్: ఇందులో అదనంగా పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వైపర్ ఉంటాయి.

6. క్రియేటివ్ - ధర: రూ. 10 లక్షల నుంచి రూ. 11.85 లక్షలు

16-ఇంచ్ అలాయ్ వీల్స్.

360-డిగ్రీ కెమెరా (బ్లైండ్ స్పాట్ అసిస్ట్‌తో).

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్.

కూల్డ్ గ్లోవ్‌బాక్స్, క్రూయిజ్ కంట్రోల్.

7. క్రియేటివ్+ ఎస్ అండ్ క్రియేటివ్+ పీఎస్ - ధర: రూ. 10.35 లక్షల నుంచి రూ. 13.07 లక్షలు

క్రియేటివ్+ ఎస్ : సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఉంటుంది.

క్రియేటివ్+ పీఎస్ : పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్లు, కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ (TPMS) వంటి ఫీచర్లు ఉంటాయి.

8. ఫియర్‌లెస్+ పీఎస్ - ధర: రూ. 12.27 లక్షల నుంచి రూ. 14.02 లక్షలు

ఇది నెక్సాన్‌లో టాప్ ఎంట్ వేరియంట్. ఫీచర్లు..

వెల్‌కమ్, గుడ్‌బై సిగ్నేచర్ లైటింగ్.

10.25-ఇంచ్ పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెదర్ సీట్ కవర్లు.

జేబీఎల్ సౌండ్ సిస్టమ్ (4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, సబ్‌వూఫర్).

ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు.

ఆటోమేటిక్ వేరియంట్లలో లెవల్-1 అడాస్ భద్రత.

టాటా నెక్సాన్ ఎస్​యూవీ- ఏ వేరియంట్ ఎవరికి?

మీరు టెక్నాలజీ, వాల్యూ ఫర్ మనీ కోరుకుంటే క్రియేటివ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో సన్‌రూఫ్ కావాలనుకుంటే ప్యూర్+ ఎస్ చూడవచ్చు. బడ్జెట్ పరిమితులు ఉన్నవారు స్మార్ట్+ ఎంచుకోవడం ఉత్తమం. లగ్జరీ, గరిష్ట భద్రత (అఢాస్) కావాలనుకునే వారు మాత్రమే ఫియర్‌లెస్+ పీఎస్ వైపు మొగ్గు చూపవచ్చు.

మరి.. ఈ టాటా నెక్సాన్ ఎస్​యూవీలో మీరు ఈ వేరియంట్​ని ఎంచుకుంటున్నారు?

  • పైన చెప్పినవి అన్నీ ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More