Tata Nexon : టాటా నెక్సాన్​లో కొత్త వేరియంట్​- ఇక బడ్జెట్ ధరలోనే ప్రీమియం పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌!

Tata Nexon price : టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్‌లో సరికొత్త ‘ప్యూర్+ పీఎస్’ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్​లో పది లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా, బడ్జెట్ ధరలోనే ప్రీమియం పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

Published on: May 9, 2026, 05:36:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tata Nexon sunroof variant : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న టాటా మోటార్స్.. తన బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ ‘నెక్సాన్’ శ్రేణిని మరింత విస్తరించింది! తాజాగా 'ప్యూర్+ పీఎస్' (Pure+ PS) పేరుతో కొత్త వేరియంట్‌ను మార్కెట్​లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 9.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.

టాటా నెక్సాన్​లో కొత్త వేరియంట్..
టాటా నెక్సాన్​లో కొత్త వేరియంట్..

దేశంలోనే తొలిసారి.. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్!

సాధారణంగా పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఖరీదైన కార్లలో లేదా టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ, టాటా మోటార్స్ మొదటిసారిగా రూ. 10 లక్షల లోపు ధరలోనే ఈ ఫీచర్‌ను అందించింది.

దేశీయ మార్కెట్​లో నెక్సాన్ ఏకంగా 10 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించిన తరుణంలో, కస్టమర్లకు కానుకగా ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్- ధరల వివరాలు..

వివిధ ఇంధన ఆప్షన్లలో లభించే ఈ వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి:

పెట్రోల్: మాన్యువల్ వెర్షన్ రూ. 9.59 లక్షలు కాగా, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 10.14 లక్షలు.

ఐసీఎన్జీ: ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో కూడిన ఈ మోడల్ ధర రూ. 10.39 లక్షలు.

డీజిల్: మాన్యువల్ వెర్షన్ రూ. 10.54 లక్షలు, ఏఎంటీ వెర్షన్ రూ. 11.19 లక్షలు.

వేరియంట్ఎక్స్​షోరూం ధర
పెట్రోల్​ ఎంటీ9.59 లక్షలు
పెట్రోల్​ ఏఎంటీ10.14 లక్షలు
ట్విన్ సిలిండర్​ ఐసీఎంజీ ఎంటీ10.39 లక్షలు
డీజిల్​ ఎంటీ10.54 లక్షలు
డీజీఎల్​ ఏఎంటీ11.19 లక్షలు

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్- ఇంజిన్, పనితీరు..

నెక్సాన్ ప్యూర్+ పీఎస్ వేరియంట్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

పెట్రోల్: 1.2 లీటర్ టర్బో ఇంజిన్ (118 bhp / 170 Nm) 5 లేదా 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

సీఎన్జీ: 99 bhp పవర్‌ను ఇచ్చే ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

డీజిల్: 1.5 లీటర్ ఇంజిన్ (113 bhp / 260 Nm) తన విభాగంలోనే అత్యధిక మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్- అదుర్స్ అనిపించే ఫీచర్లు..

కొత్త వేరియంట్‌లో కేవలం సన్‌రూఫ్ మాత్రమే కాదు, మరిన్ని అత్యాధునిక ఫీచర్లను కూడా టాటా మోటార్స్ జోడించింది:

వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్.

26.03 సెంటీమీటర్ల హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే.

సిక్స్ స్పీకర్ ఆడియో సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్.

ఆటో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్.

హెచ్‌డీ రియర్ వ్యూ కెమెరా, ఆటో-ఫోల్డ్ ఫంక్షనాలిటీ కలిగిన ఓఆర్​వీఎంలు

మొత్తానికి, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే కారు ప్రియులకు నెక్సాన్ కొత్త వేరియంట్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

టాటా మోటార్స్​కి ఈ టాటా నెక్సాన్ బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా కొనసాగుతోంది. తాజా వేరియంట్​తో సేల్స్​ని మరింత పెంచుకోవచ్చని సంస్థ భావిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More