Hyundai SUV : హ్యుందాయ్ నుంచి కొత్త మిడ్​ సైజ్​ ఎస్​యూవీ- అడాస్​ ఫీచర్​తో..

Hyundai new cars : భారత మార్కెట్​పై పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా సిద్ధమైంది. వెన్యూ, క్రెటా మధ్య ఖాళీని భర్తీ చేస్తూ 'బేయన్' ఆధారంగా ఒక కొత్త మిడ్-సైజ్ ఎస్​యూవీని, అలాగే ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్​యూవీని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేయనుంది.

Published on: May 10, 2026, 09:08:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Upcoming cars in India : భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు సరికొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి ప్రస్తుతం యూరోప్​లో సేల్​లో ఉన్న ‘బేయన్’పై ఆధారపడిన మిడ్-సైజ్ ఎస్​యూవీ కాగా, రెండోది స్థానికంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్​యూవీ. ఇప్పుడందరి ఫోకస్ ఈ మిడ్​-సైజ్​ ఎస్​యూవీపై పడింది. ముఖ్యంగా వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య ఉన్న భారీ ధర, సైజు వ్యత్యాసాన్ని భర్తీ చేయడమే ఈ దీని ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్​యూవీ..
హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్​యూవీ..

డిజైన్, పరిమాణం..

ఈ కొత్త మోడల్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి మారుతీ ఫ్రాంక్స్‌కు పోటీగా వస్తుందని గతంలో భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ హ్యుందాయ్ బేయన్ ఆధారిత ఎస్​యూవీ 4.2 మీటర్ల పొడవుతో ఉండనుంది.

లుక్: హ్యుందాయ్ లేటెస్ట్ "సెన్సువస్ స్పోర్టినెస్" డిజైన్ లాంగ్వేజ్‌తో, బాక్సీ ఆకారంలో మరింత ఎత్తుగా కనిపిస్తుంది.

ఫీచర్లు: స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఐస్-క్యూబ్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హై-మౌంటెడ్ డీఆర్ఎల్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. అలాగే 16- ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో ఇది ముస్తాబవుతోంది.

తొలిసారిగా డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ..

హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఈ 'Bc4i' (కోడ్ నేమ్) ఎస్​యూవీలో అత్యంత ఆసక్తికరమైన అంశం దీని పవర్‌ట్రెయిన్. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న హ్యుందాయ్ కార్లలో సీఎన్జీ వేరియంట్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదే కానుంది. ఇందులో టాటా కార్ల తరహాలో 'డ్యూయల్ సిలిండర్' సెటప్‌ను అందించనున్నారు, దీనివల్ల బూట్ స్పేస్ (డిక్కీ)లో ఎక్కువ స్థలం లభిస్తుంది.

ఇది నేరుగా మార్కెట్​లో సక్సెస్​ఫుల్​గా దూసుకుపోతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్​కు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్..

ఈ ఎస్​యూవీలో వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది:

1.5ఎల్ పెట్రోల్: 114బీహెచ్​పీ పవర్, 144ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేస్తారు.

టర్బో పెట్రోల్: పనితీరును మెరుగుపరిచేందుకు 1.5ఎల్ టర్బో లేదా సరికొత్త 1.2ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే ఛాన్స్ ఉంది.

డీజిల్: కస్టమర్ల డిమాండ్ మేరకు డీజిల్ వేరియంట్ కూడా లైన్-అప్‌లో చేరవచ్చు.

టెక్నాలజీ, సేఫ్టీ..

మారుతీ సుజుకీ అనుసరిస్తున్న మల్టిపుల్ ఎస్​యూవీ స్ట్రాటజీని (విక్టోరిస్, గ్రాండ్ విటారా) ఇప్పుడు హ్యుందాయ్ కూడా అమలు చేస్తోంది. ఈ కొత్త మిడ్​ సైజ్​ ఎస్​యూవీలో అత్యాధునిక ఇంటీరియర్‌తో పాటు అత్యున్నత భద్రత కోసం అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను కూడా చేర్చనున్నారు. కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ ఎత్తుగడ వేస్తోంది.

ఈ మోడల్​ 2027 మార్చ్​లోపు లాంచ్​ అవ్వొచ్చని తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More