Upcoming cars : ఇండియా కోసం హోండా భారీ స్కెచ్! ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు ఈ కొత్త మోడల్స్..
భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఈవీ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రానున్న నెలల్లో హోండా నుంచి భారత రోడ్లపైకి కొన్ని ముఖ్యమైన కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాము..
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా, ఈ ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై2026-27) భారత మార్కెట్లో ఏకంగా 6 సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే ‘సిటీ ఫేస్‌లిఫ్ట్’ మార్కెట్లోకి రాగా.. సరికొత్త ‘జెడ్ఆర్-వీ హైబ్రిడ్’ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఒక సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, అప్‌గ్రేడెడ్ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్, గ్లోబల్ మార్కెట్లోని కొన్ని ప్రీమియం కార్లను భారత్‌కు తీసుకురావడానికి హోండా సన్నద్ధమవుతోంది. వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

1. హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..
హోండా తమ సరికొత్త '0 ఆల్ఫా' కాన్సెప్ట్ ఆధారిత ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత రోడ్లపై అధికారికంగా టెస్టింగ్ చేయడం ప్రారంభించింది.
తయారీ: ఈ ఎలక్ట్రిక్ కారును రాజస్థాన్‌లోని హోండా 'తపుకరా' ప్రొడక్షన్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయనున్నారు.
లాంచ్ ఎప్పుడు?: దీనిని 2027 మొదటి త్రైమాసికంలో (క్యూ1 2027) మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
డిజైన్ అండ్ ఫీచర్లు: ఇది బాక్స్ షేప్, ఫ్లాట్ టెయిల్‌గేట్, నిటారైన స్టాన్స్‌తో రోడ్లపై పవర్‌ఫుల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు ఉంటాయి.
పోటీ: ఇది మార్కెట్లోకి వచ్చాక హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతీ సుజుకీ ఈ విటారా, టాటా సియెర్రా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
2. హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్..
ప్రస్తుతం మంచి విక్రయాలతో దూసుకుపోతున్న ఎలివేట్ ఎస్‌యూవీని సరికొత్త మార్పులతో హోండా అప్‌గ్రేడ్ చేయనుంది.
లాంచ్ ఎప్పుడు?: ఇది 2026 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
మార్పులు: కారు ముందు భాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. క్యాబిన్ లోపల సరికొత్త అప్‌హోలిస్ట్రీ (సీట్ల డిజైన్) తో పాటు మరిన్ని లగ్జరీ ఫీచర్లు తోడవుతాయి.
ఇంజన్: ఇందులో నమ్మకమైన 1.5-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించనున్నారు (6-స్పీడ్ మాన్యువల్/ సీవీటీ ఆటోమేటిక్). కొన్ని నివేదికల ప్రకారం ఇందులో 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఇంజన్ వచ్చే అవకాశం కూడా ఉంది, అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Honda ZR V : హోండా కొత్త ఎస్‌యూవీ జెడ్ఆర్- వీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..
3. గ్లోబల్ కార్ల రీ-ఎంట్రీ..
భారతదేశంలో ప్రీమియం కార్ల లవర్స్ కోసం హోండా తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి కొన్ని ఐకానిక్ కార్లను సీబీయూ (పూర్తిగా విదేశాల్లో తయారై దిగుమతి చేసుకునే) రూపంలో భారత్‌కు తీసుకురావాలని పరిశీలిస్తోంది.
ఇందులో భాగంగానే సరికొత్త హోండా సివిక్, సీఆర్-వీ, అకార్డ్, స్పోర్టీ లుక్ ఉన్న ప్రిల్యూడ్ కార్లను తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉంది.
ఈ సరికొత్త మోడళ్ల లాంచ్‌తో హోండా బ్రాండ్ ఇటు లగ్జరీ సెడాన్, అటు పవర్‌ఫుల్ ఎస్‌యూవీ, ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో కస్టమర్లకు భారీ ఆప్షన్లను అందించబోతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


