Discount on Honda cars : ఎలివేట్​ నుంచి అమేజ్​ వరకు- ఈ హోండా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు..

Cars discounts : ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ముగించేందుకు హోండా కార్స్ ఇండియా తన పోర్ట్​ఫోలియోలోని వెహికిల్స్​పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సిటీ, ఎలివేట్, అమేజ్ వంటి పాపులర్ మోడళ్లపై క్యాష్​ డిస్కౌంట్స్​​, ఎక్స్​ఛేంజ్​ బోనస్‌లతో కలిపి భారీ ప్రయోజనాలను అందిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి

Published on: Mar 04, 2026 11:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి సమయం. హోండా కార్స్ ఇండియా ఈ మార్చి నెలలో తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై భారీ పథకాలను ప్రకటించింది. డీలర్ల వద్ద ఉన్న ఇన్వెంటరీని తగ్గించుకోవడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపులో విక్రయాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్​ డిస్కౌంట్స్​, ఎక్స్​ఛేంజ్​- స్క్రాపేజ్ బోనస్‌లు, అలాగే లాయల్టీ రివార్డులు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా కార్లపై డిస్కౌంట్లు..
హోండా కార్లపై డిస్కౌంట్లు..

హోండా కార్స్​పై భారీ డిస్కౌంట్లు- ఏ కారుపై ఎంత?

హోండా సిటీ ఈ: హెచ్​ఈవీ (హైబ్రిడ్)-

ఈ నెలలో అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం సిటీ హైబ్రిడ్ వెర్షన్‌పైనే ఉంది. దీనిపై ఏకంగా రూ. 1.97 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది కలిపి 126 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ-సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.

హోండా సిటీ (పెట్రోల్)-

హోండా సిటీ పెట్రోల్ వెర్షన్లపై రూ. 1.56 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో 121 హెచ్​పీ పవర్​ని ఇచ్చే 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.95 లక్షల నుంచి రూ. 16.07 లక్షల మధ్య ఉన్నాయి.

హోండా ఎలివేట్ (ఎస్​యూవీ)-

మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'ఎలివేట్'పై రూ. 1.81 లక్షల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. సిటీ సెడాన్‌లో ఉన్న 121 హెచ్​పీ, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నే ఇందులోనూ వాడారు. అయితే, ఎలివేట్‌లో హైబ్రిడ్ వెర్షన్ అందుబాటులో లేదు. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి గట్టి పోటీదారులను ఎదుర్కొనేందుకు హోండా ఈ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీని ధర రూ. 11.6 లక్షల నుంచి రూ. 16.67 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

హోండా అమేజ్-

హోండా ప్రస్తుతం మార్కెట్లో అమేజ్ మొదటి- రెండవ తరం మోడళ్లను విక్రయిస్తోంది.

పాత మోడల్: దీనిపై రూ. 68,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ధర రూ. 6.98 లక్షల నుంచి రూ. 7.8 లక్షల మధ్య ఉంది.

కొత్త మోడల్: ఇటీవల విడుదలైన కొత్త అమేజ్‌పై కూడా హోండా రూ. 57,000 వరకు ఆఫర్లను ఇస్తోంది. దీని ధరలు రూ. 7.48 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్నాయి.

ఈ రెండు వెర్షన్లలోనూ 90 హెచ్​పీ పవర్​ని ఇచ్చే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. టాటా టిగోర్, మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు పోటీగా అమేజ్ నిలుస్తోంది.

గమనిక- స్టాక్ లభ్యతను బట్టి ఆయా డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు మారుతుంటాయని గుర్తుపెట్టుకోవాలి. పూర్తి వివరాల కోసం మీ సమీప హోండా షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. హోండా సిటీ హైబ్రిడ్​పై రూ. 1.97 లక్షల భారీ డిస్కౌంట్ అందరికీ వర్తిస్తుందా?

ఈ ఆఫర్ గరిష్ట ప్రయోజనాలను సూచిస్తుంది. ఇందులో నగదు తగ్గింపుతో పాటు పాత కారును ఎక్స్​ఛేంజ్ చేయడం వల్ల వచ్చే బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. మీ పాత కారు కండిషన్- మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ఈ మొత్తం మారుతుంది. పూర్తి వివరాల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించడం ఉత్తమం.

2. కొత్తగా విడుదలైన 'హోండా అమేజ్' (న్యూ జెన్​) పైన కూడా డిస్కౌంట్లు ఉన్నాయా?

అవును, సాధారణంగా కొత్త మోడళ్లపై ఆఫర్లు తక్కువగా ఉంటాయి. కానీ, కాంపాక్ట్ సెడాన్ విభాగంలో పోటీని తట్టుకోవడానికి హోండా కొత్త అమేజ్‌పై కూడా రూ. 57,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది కొత్త కారు కొనాలనుకునే వారికి మంచి అవకాశం.

3. హోండా ఎలివేట్​లో కూడా హైబ్రిడ్ వెర్షన్ అందుబాటులో ఉందా?

లేదు, హోండా ఎలివేట్ ప్రస్తుతం కేవలం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తోంది (మాన్యువల్- సీవీటీ ఆటోమేటిక్). సిటీ సెడాన్‌లో ఉన్నట్లుగా ఎలివేట్‌లో హైబ్రిడ్ ఆప్షన్ లేదు. అందుకే, ఎలివేట్ ధరను పోటీగా ఉంచేందుకు హోండా ఈ నెలలో రూ. 1.81 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది.