Maruti Suzuki E Vitara : మారుతీ సుజుకీ ఈ విటారా వేరియంట్లు- వాటి ఫీచర్లు, ధరలు..

మారుతీ సుజుకీ ఈ విటారా కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీరు కచ్చితంగా చూడాలి. మారుతీ సుజుకీ ఈ విటారా వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరల వివరాాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 22, 2026, 06:12:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారు పేరు ‘ఈ విటారా’. ఈ ఈవీకి సంబంధించిన ధరల వివరాలను సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీరు ఒకవేళ ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఇందులోని వేరియంట్లు- వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఈ విటారా..
మారుతీ సుజుకీ ఈ విటారా..

మారుతీ సుజుకీ ఈ విటారా- వేరియంట్లు..

ఈ మారుతీ సుజుకీ ఈ విటారా డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. అలాగే కస్టమర్ల సౌకర్యార్థం రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఛాయిస్‌లను కూడా ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఈ విటారా- వేరియంట్లు, వాటి ఫీచర్లు..

1. మారుతీ సుజుకీ ఈ విటారా - డెల్టా

ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ, మారుతీ సుజుకీ దీనిని ఫీచర్లతో నింపేసింది.

పర్ఫార్మెన్స్: ఇందులో 49 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 144 బీహెచ్​పీ పవర్, 193 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్‌పై 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్లు: 10.25- ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.1- ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

సౌకర్యం: రియర్ ఏసీ వెంట్లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పీఎం2.5 ఎయిర్ ఫిల్టర్, కీ-లెస్​ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ వైపర్స్, ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్‌తో కూడిన ఆటో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్.

భద్రత: ఈ వేరియంట్ నుంచే 7 ఎయిర్‌బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్​, బ్రేక్ అసిస్ట్, ఆటో-హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ కంట్రోల్, టీపీఎంఎస్​, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్లు లభిస్తాయి.

ఇతరాలు: ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో అనే డ్రైవ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, 40:20:40 స్ప్లిట్ అయ్యే రిక్లైనింగ్ సీట్లు, లెదరెట్ స్టీరింగ్ వీల్, 18-ఇంచ్​ ఏరో-స్టైల్ అలాయ్ వీల్స్.

2. మారుతీ సుజుకీ ఈ విటారా - జీటా

ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ జీటా వేరియంట్​లో పెద్దదైన 61 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ప్రామాణికంగా వస్తుంది.

సామర్థ్యం: ఇది 174 బీహెచ్​పీ పవర్, 193 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, ఏకంగా 543 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.

అదనపు ఫీచర్లు: డెల్టాలోని ఫీచర్లతో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ పార్కింగ్ కెమెరా, పార్సెల్ ట్రే వంటి అదనపు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

3. మారుతీ సుజుకీ ఈ విటారా - ఆల్ఫా

ఇది అన్నింటికంటే విలాసవంతమైన టాప్-ఎండ్ వేరియంట్. 61 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో వస్తుంది.

అత్యాధునిక టెక్నాలజీ: ఇందులో లెవల్ 2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

సౌకర్యం: వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, సెమీ-లెదరెట్ అప్​హోలిస్ట్రీ.

వినోదం: సబ్-వూఫర్‌తో కూడిన 8-స్పీకర్ల ప్రీమియం ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, క్యాబిన్‌కు విలాసవంతమైన అనుభూతిని ఇచ్చే 'ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ ప్యానెల్'.

కలర్ ఆప్షన్లు: మారుతీ ఈ ఎలక్ట్రిక్​ కారును ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే, నెక్సా బ్లూ వంటి ఆరు మోనోటోన్ షేడ్స్, కాంట్రాస్ట్ రూఫ్‌తో కూడిన నాలుగు డ్యూయల్-టోన్ కాంబినేషన్లలో అందిస్తోంది.

మారుతీ సుజుకీ ఈ విటారా- వేరియంట్లు, వాటి ధరలు (ఎక్స్-షోరూమ్):

డెల్టా : 49 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో కూడిన ఈ మారుతీ సుజుకీ ఈ విటారా బేస్ వేరియంట్ సాధారణ ధర రూ. 15.99 లక్షలు. అయితే బీఏఏఎస్​ (బ్యాటరీ ఆస్​ ఏ సర్వీస్​) స్కీమ్ కింద ఇది కేవలం రూ. 10.99 లక్షలకే లభిస్తుంది.

జీటా : ఇది కేవలం పెద్దదైన 61 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో మాత్రమే వస్తుంది. దీని ధర రూ. 17.49 లక్షలు. బీఏఏఎస్​ కింద దీనిని రూ. 11.99 లక్షలు + కిలోమీటరుకు రూ. 4.39 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

ఆల్ఫా : టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 19.79 లక్షలు. బీఏఏఎస్​ స్కీమ్‌లో దీని ధర రూ. 14.29 లక్షలు + కిలోమీటరుకు రూ. 4.39 గా నిర్ణయించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More