Maruti Suzuki e Vitara : మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వేరియంట్లు- వాటి ధరలు..
మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు “ఈ విటారా”ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ విటారా' ధరల విషయంలో ఉన్న సస్పెన్స్‌కు తెరదించింది. కొద్దిరోజుల క్రితమే 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) విధానంలో ప్రారంభ ధరను ప్రకటించిన సంస్థ, ఇప్పుడు బ్యాటరీతో కలిపి కారు పూర్తి ధర ఎంతనేది అధికారికంగా వెల్లడించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని పెంచుతూ మారుతీ సుజుకీ ఈ ధరలను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఈ విటారా వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- వేరియంట్లు, ధరలు..
మారుతీ సుజుకీ ఈ విటారాను ప్రధానంగా రెండు పద్ధతుల్లో కొనుగోలు చేయవచ్చు. ఒకటి బ్యాటరీ అద్దెకు తీసుకునే బీఏఏఎస్ పద్ధతి, రెండోది బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేసే సాధారణ పద్ధతి.
1. బ్యాటరీతో కలిపి పూర్తి ధరలు:
ఒకవేళ మీరు బ్యాటరీని అద్దెకు తీసుకోకుండా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటే కొనుగోలు చేయాలనుకుంటే ధరలు ఈ విధంగా ఉన్నాయి:
డెల్టా (49 కేడబ్ల్యూహెచ్): రూ. 15.99 లక్షలు
జిటా (61 కేడబ్ల్యూహెచ్): రూ. 17.49 లక్షలు
ఆల్ఫా (61 కేడబ్ల్యూహెచ్): రూ. 19.79 లక్షలు
గమనిక: డ్యూయల్ టోన్ వేరియంట్ కావాలనుకుంటే అదనంగా రూ. 21,000 చెల్లించాల్సి ఉంటుంది.
2. బీఏఏఎస్ (బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్) పద్ధతిలో:
ఈ విధానంలో ఈ మారుతీ సుజుకీ ఈ విటారా కొనేటప్పుడు తక్కువ ధర చెల్లించి, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు కొంత చొప్పున అద్దె కట్టాలి.
డెల్టా (49 కేడబ్ల్యూహెచ్): రూ. 10.99 లక్షలు (అద్దె: కి.మీ.కు రూ. 3.99)
జిటా (61 కేడబ్ల్యూహెచ్): రూ. 11.99 లక్షలు (అద్దె: కి.మీ.కు రూ. 4.39)
ఆల్ఫా (61 కేడబ్ల్యూహెచ్): రూ. 14.29 లక్షలు (అద్దె: కి.మీ.కు రూ. 4.39)
మారుతీ సుజుకీ ఈ విటారా- ఆకర్షణీయమైన ఆఫర్లు..
ప్రస్తుతం ప్రకటించిన ఈ ధరలన్నీ 'ప్రారంభ ధరలు' (ఇంట్రొడొక్టరీ) మాత్రమే. ఇవి మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, తొలి వినియోగదారుల కోసం మారుతీ సుజుకీ మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. అవి..
- ఉచిత హోమ్ ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ సదుపాయం.
- మూడేళ్ల తర్వాత 60% వరకు అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్.
- బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ.
మారుతీ సుజుకీ ఈ విటారా- పెర్ఫార్మెన్స్, రేంజ్..
ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 543 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) రేంజ్ అందిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తోంది.
మారుతీ సుజుకీ ఈ విటారా- పోటీదారులతో పోలిస్తే..
మారుతీ తన ఈ విటారా ధరను చాలా కాంపిటీటివ్‌గా నిర్ణయించిందనే చెప్పుకోవాలి. మార్కెట్లో దీని ప్రధాన ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (రూ. 18.02 లక్షల నుంచి), టాటా కర్వ్ ఈవీ (రూ. 17.49 లక్షల నుంచి), మహీంద్రా బీఈ 6 (రూ. 18.90 లక్షల నుంచి) వంటి మోడళ్లతో పోలిస్తే, ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
మరింత సమాచారం కోసం లేదా బుకింగ్స్ కోసం సమీపంలోని మారుతీ సుజుకీ నెక్సా షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

E-Paper












