Honda ZR V : హోండా కొత్త ఎస్‌యూవీ జెడ్ఆర్- వీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ సంస్థ హోండా.. భారత మార్కెట్లోకి తమ సరికొత్త ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ ‘హోండా జెడ్ఆర్-వీ’ ఆవిష్కరించింది. భారత్‌లో హోండాకు ఇది సరికొత్త ఫ్లాగ్‌షిప్ (టాప్-ఎండ్) మోడల్ కానుంది. ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకునే ముందు కస్టమర్లు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడండి..
Honda ZR V price : భారతదేశంలో ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మళ్లీ పట్టు సాధించేందుకు హోండా కార్స్ సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 'హోండా ఎలివేట్' కారు కంటే పై విభాగంలో సరికొత్త హోండా జెడ్ఆర్-వీ అనే ఎస్‌యూవీని తాజాగా రివీల్ చేసింది. ఈ కారుకు సంబంధించిన ప్రీ-లాంచ్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. కస్టమర్ డెలివరీలు 2026 జులై రెండో వారం నుంచి షురూ అవుతాయి. ఈ నేపథ్యంలో మీరు ఒకవేళ ఈ ఎస్‌యూవీని కొనాలని ప్లానే చేస్తుంటే, ఈ కీలక విషయాలను తెలుసుకోవాలి..

1. స్లీక్ అండ్ మోడ్రన్ డిజైన్..
హోండా ఎలివేట్ బాక్స్ తరహా డిజైన్‌తో పోలిస్తే, జెడ్ఆర్-వీ చాలా భిన్నంగా, స్లీక్ అండ్ స్పోర్టీ లుక్‌తో ఉంటుంది. దీని పొడవు 4,567 ఎంఎం, వెడల్పు 1,840 ఎంఎం, ఎత్తు 1,621 ఎంఎం, వీల్‌బేస్ 2,655 ఎంఎంగా ఉంది. కారు వెనుక భాగంలో రూఫ్ స్పాయిలర్, డ్యూయల్-ఎగ్జాస్ట్ సిస్టమ్, 18-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనికి రోడ్లపై ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
2. పవర్‌ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్..
మైలేజ్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం ఈ హోండా జెడ్ఆర్-వీలో e:HEV స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతను అందించారు.
ఇందులో 2.0-లీటర్ అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఉంటాయి.
ఇది మొత్తంగా 181 బీహెచ్పీ పవర్, 315 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజ్: లీటరుకు ఏకంగా 22.79 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ఇందులో నార్మల్, స్పోర్ట్, ఎకో అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా, హైబ్రిడ్ విడిభాగాలపై కంపెనీ 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ వారంటీని ఇస్తోంది.
3. జపాన్ నుంచి నేరుగా దిగుమతి (సీబీయూ)..
భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేసే ఇతర మిడ్-సైజ్ ఎస్‌యూవీల్లా కాకుండా, హోండా జెడ్ఆర్-వీ కారును జపాన్ నుంచి సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారత్‌కు ఇంపోర్ట్ చేయనున్నారు. దీనివల్ల కారు బిల్డ్ క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉంటుంది. అయితే, దిగుమతి సుంకాల కారణంగా దీని ధర దేశీయ కార్ల కంటే కాస్త ప్రీమియంగా (ఎక్కువగా) ఉండే అవకాశం ఉంది.
4. లగ్జరీ క్యాబిన్ అండ్ మోడ్రన్ ఫీచర్లు..
హోండా జెడ్ఆర్-వీ ఎస్‌యూవీ లోపలి భాగం (ఇంటీరియర్) గ్లోబల్ స్టాండర్డ్స్‌తో చాలా లగ్జరీగా డిజైన్ చేసింది సంస్థ.
ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి.
స్టాండర్డ్‌గా హీటెడ్ ఫ్రంట్ సీట్లు రాగా.. టాప్ వేరియంట్లలో లెథరెట్ అప్హోల్‌స్టరీ, హీటెడ్ రియర్ సీట్స్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు లభిస్తాయి.
5. హోండా సెన్సింగ్ అడాస్ భద్రత..
భద్రత పరంగా ఈ కారులో హోండా తమ సిగ్నేచర్ 'హోండా సెన్సింగ్' అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్) సూట్‌ను అందించింది. ఇందులో కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ (ఆటోమేటిక్ బ్రేకింగ్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు రాత్రి వేళ సురక్షిత ప్రయాణం కోసం యాక్టివ్ కార్నరింగ్ లైట్లు, యాక్టివ్ డ్రైవింగ్ బీమ్ టెక్నాలజీని కూడా అమర్చారు.
ఈ హోండా జెడ్ఆర్-వీ ధరలను సంస్థ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా మార్కెట్ అంచనాల ప్రకారం దీని ఎక్స్‌షోరూం ధర రూ. 40లక్షల నుంచి రూ. 50లక్షల మధ్యలో ఉండొచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


