...
...
Next Story

AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

AP ICET Final Phase Counselling : ఏపీ ఐసెట్-2026 చివర విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.

Published on: Sep 21, 2026, 07:01:46 IST
Advertisement

AP ICET Final Phase Counselling ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి కీలక సమాచారం అందించింది. ఏపీ ఐసెట్‌-2026 (AP ICET 2026) చివరి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించినషెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లు, కంప్యూటర్ అప్లికేషన్స్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

ముఖ్య తేదీలు…

  • అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ (సెప్టెంబర్ 21, 2026) నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ప్రాసెస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దీనికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ల (HLCs) ద్వారా అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన ప్రక్రియ సెప్టెంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతుంది.
  • ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తయిన అభ్యర్థులు తమకు కావలసిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ల నమోదును సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
  • నమోదు చేసిన ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకునే వారికి సెప్టెంబర్ 24వ తేదీన అవకాశం కల్పిస్తారు.
  • ఈ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 26వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in

రిపోర్టింగ్ తేదీలు

ఏపీ ఐసెట్ 2026
ఏపీ ఐసెట్ 2026

సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ జాయినింగ్ పూర్తి చేసి, కేటాయించిన కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ తరగతులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో, ఈ చివరి విడతలో సీట్లు సాధించిన వారు కూడా వెంటనే కళాశాలలకు హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు నిర్దేశిత గడువులోగా తమ ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks