BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - కౌన్సెలింగ్ తేదీ ఖరారు! ఇవిగో వివరాలు

BRAOU MBA HHCM Counselling 2026 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ తేదీ ఖరారైంది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

Published on: Sep 20, 2026, 10:45:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU MBA HHCM Counselling 2026 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (MBA-HHCM) కోర్సులో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కోర్సులో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు

అర్హులు ఎవరంటే..?

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్) వేదికగా ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతారు. ఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కొన్ని నిర్దిష్టమైన అర్హతలు కలిగి ఉండాలి. తెలంగాణ ఐసెట్ (TG ICET - 2026) లో అర్హత సాధించిన విద్యార్థులు లేదా విశ్వవిద్యాలయం స్వయంగా నిర్వహించిన 'BRAOU ఎంబీఏ ఈటీ-2026' (BRAOUMBAET-2026) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అర్హులు.

అర్హత ఉన్న అభ్యర్థులందరూ సెప్టెంబర్ 22న నేరుగా విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి స్వయంగా రావలసి ఉంటుంది. కౌన్సెలింగ్ సమయానికి అభ్యర్థులు తమ వద్ద ఉండాల్సిన అన్ని రకాల ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికేట్లు, సంబంధిత ధృవపత్రాలు (ఆధార్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, క్యాస్ట్, ఇన్‌కమ్, స్టడీ సర్టిఫికేట్లు మొదలైనవి) తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.

ఈ కోర్సు, కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. సాంకేతిక సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం బ్రావు కాల్ సెంటర్ ఉచిత నంబర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 040-23680222 / 333 / 444 / 555 లలో నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More