TG LAWCET Counseling : టీజీ లాసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే…?
TG LAWCET 2026 Final Phase Counseling : టీజీ లాసెట్ - 2026 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ (TG LAWCET) 2026 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. న్యాయ విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన అభ్యర్థులు…. తమకు ఇష్టమైన కళాశాలల ప్రాధాన్యత ప్రకారం వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో కళాశాలల ఆప్షన్లను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకుంటే, సెప్టెంబర్ 21వ తేదీన మాత్రమే ఆప్షన్లను సవరించుకునే (ఎడిట్) అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను జాగ్రత్తగా పరిశీలించి ఆప్షన్లు లాక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు, ఎంట్రెన్స్ టెస్టులో సాధించిన ర్యాంక్ , కేటగిరీ రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 25న తాత్కాలికంగా సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను (Provisional Allotment List) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. ఫైనల్ ఫేజ్‌లో సీటు సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదు, తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సహా సంబంధిత కళాశాలల్లో సెప్టెంబర్ 29వ తేదీ నాటికి నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
గతంలో నిర్వహించిన మొదటి, రెండవ విడత (ఫేజ్-1, ఫేజ్-2) కౌన్సెలింగ్‌లలో సీట్లు పొంది కూడా కళాశాలల్లో చేరని అభ్యర్థులకు… అలాగే సీటు వచ్చిన తర్వాత తమ ప్రవేశాలను రద్దు చేసుకున్న విద్యార్థులకు ఈ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అర్హత లేదని లాసెట్ కన్వీనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, వెబ్ ఆప్షన్ల నమోదు మరియు సీట్ల కేటాయింపు సమాచారం కోసం నిరంతరం అధికారిక వెబ్‌సైట్ https://lawcetadm.tgche.ac.in/ ను పరిశీలించాలని సూచించారు.
వెబ్ ఆప్షన్లు ఎంచుకోవటం ఎలా..?
- అభ్యర్థులు మొదటగా తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోంపేజీలో కనిపించే వెబ్ ఆప్షన్ల లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్ తో పాటు మీ పాస్ వివరాలను నమోదు చేయాలి.
- కాలేజీల లిస్ట్ డిస్ ప్లే అవుతుంది. ప్రాధాన్యత క్రమంలో వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ప్రాసెస్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

