TG JCCET Results : సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల ప్రవేశాలు - ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల, రిపోర్టింగ్ తేదీ ఇదే

TG Social Welfare JCCET Results  2026 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష (జేసీసెట్) ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. మొదటి విడతలో ఇంటర్ ప్రవేశాల కోసం 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

Published on: May 29, 2026, 12:54:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG Social Welfare JCCET Results 2026 : తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఫలితాలను (జేసీసెట్‌) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ విడుదల చేశారు. ఈ ఫలితాల ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గానూ మొదటి విడతలో (First Phase) మొత్తం 18,401 మంది విద్యార్థులు సీట్లు సాధించి ఎంపికయ్యారు.

టీజీ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల ప్రవేశాలు (image source istock )
టీజీ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల ప్రవేశాలు (image source istock )

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), ఎంఈసీ (MEC), సీఈసీ (CEC), హెచ్ఈసీ (HEC) గ్రూపులతో పాటు వివిధ ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 19,740 ఇంటర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి.

ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు రాగా.. ఈ నెల 15న నిర్వహించిన జేసీ సెట్ ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు మొదటి విడత ఎంపిక జాబితాను సిద్ధం చేశారు.

రిపోర్టింగ్ తేదీలివే

మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించి ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఉందని కొనియాడారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత బాధ్యతాయుతంగా గురుకులాలను నిర్వహించాలని, విద్యా ప్రమాణాలను పెంచాలని అధికారులను ఆదేశించారు.

గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని మంత్రి తేల్చి చెప్పారు. గతంలో కొన్ని గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ (ఆహారం వికటించడం) వంటి దురదృష్టకర ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని గుర్తుచేశారు. అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More