TG SET 2026 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - అక్టోబర్‌లో పరీక్షలు
TG SET 2026 Notification : తెలంగాణలోని డిగ్రీ కళాశాలలు, వర్సిటీల్లో లెక్చరర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే 'టీజీ సెట్ 2026' నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అక్టోబర్‌లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
TG SET 2026 Notification : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET)-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే అభ్యర్థులకు ఈ పరీక్ష అత్యంత కీలకం కానుంది. పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే పరీక్షలను రాయాల్సి ఉంటుంది.
- టీజీ సెట్ పరీక్షను మొత్తం రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒకే విడతలో ఈ రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది.
- పేపర్-1: ఈ పేపర్‌లో అభ్యర్థుల జనరల్ అవేర్‌నెస్, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది.
- పేపర్-2: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ రెండు పేపర్లను కలిపి రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం కేటాయించనున్నారు. పరీక్ష మధ్యలో ఎలాంటి విరామం ఉండదు.
- టీజీ సెట్ 2026 నోటిఫికేషన్, సిలబస్ తో పాటు పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు
త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తులు
టీజీ సెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రకటించనున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయి సమాచారంతో కూడిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారు. ఈ మేరకు టీజీ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు.
అర్హత ప్రమాణాలు, సిలబస్, పరీక్ష ఫీజు, పరీక్ష కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్ల కోసం అభ్యర్థులు నిరంతరం అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.org ను సందర్శించాలి. పీజీ పూర్తి చేసిన వారు…. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

