TG TET 2026 Syllabus : తెలంగాణ టెట్ సిలబస్ విడుదల - మీ సబ్జెక్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG TET Syllabus 2026 : టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా సిలబస్(పేపర్-1, పేపర్-2 ) కూడా అందుబాటులోకి వచ్చింది.

Published on: Apr 16, 2026 3:44 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana TET Syllabus 2026 : తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ సెషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.

తెలంగాణ టెట్ సిలబస్ 2026
తెలంగాణ టెట్ సిలబస్ 2026

మరోవైపు అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

కేవలం చదవడమే కాకుండా.. సిలబస్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం విజేతగా నిలవడానికి చాలా ముఖ్యం. అభ్యర్థులు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా అధికారిక వెబ్‌సైట్ నుంచే సిలబస్‌ను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

టీజీ టెట్ 2026 సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. టీజీ టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఇక్కడ హోం పేజీలో కనిపించే సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి.
  3. 15 పేపర్ల పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై నొక్కితే సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది.
  4. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1, ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లలోనూ 150 మార్కులకు గానూ 150 ప్రశ్నలు ఇస్తారు. సమయం రెండున్నర గంటలు ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు తెలంగాణ టెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.

తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:

  • దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
  • పరీక్ష తేదీలు - జూన్ 15, 2026 నుంచి జూన్ 30, 2026 మధ్య జరుగుతాయి.
  • టెట్ ఫలితాల వెల్లడి: జూలై 28 నుంచి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More