TG TET Notification 2026 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

TG TET Notification 2026 : తెలంగాణ టెట్(జూన్ సెషన్ ) నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయి.

Published on: Apr 13, 2026 1:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana TET Notification 2026 : తెలంగాణలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కొత్తగా టెట్ నోటిఫికేషన్ (జూన్ సెషన్ ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రాథమిక వివరాలను ప్రకటించింది.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026

టీజీ టెట్ పూర్తిస్థాయి వివరాలతో కూడిన వివరాలు ఏప్రిల్ 15వ తేదీన అందుబాటులోకి వస్తుంది. ఇదే రోజు నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. జూన్ 15, 2026 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.

టీజీ టెట్ నోటిఫికేషన్ - ముఖ్యమైన తేదీలు :

  • టీజీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 15, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ - ఏప్రిల్ 30, 2026.
  • టీజీ టెట్ పరీక్షలు ప్రారంభం -జూన్ 15, 2026

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షా ఫీజు, సిలబస్ మరియు అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15న విడుదలయ్యే ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ఉంటాయి.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More