TG TET Result 2026 : టీజీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి
TG TET 2026 ఫలితాలు వచ్చేశాయి. 1 లక్ష మందికి పైగా అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు ఫలితాలు చూసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET) ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ద్వారా వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి వారి అర్హత స్థితిని చెక్ చేయవచ్చు. ఇటీవల టెట్ ప్రాథమిక కీ ని విడుదల చేశారు అధికారులు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాలు, కీ ని వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.

గణాంకాల ప్రకారం 37,893 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులతో సహా మొత్తం 100,270 మంది అభ్యర్థులు (51.37 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు. తెలంగాణలోని పాఠశాలల్లో I నుండి VIII తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం టీజీ టెట్ 2026 జనవరి 3 నుండి 20, 2026 వరకు జరిగింది.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ కు వెళ్లండి
- హోమ్‌పేజీలో TG TET ఫలితాలు 2026 లింక్ కోసం చూసి దానిపై క్లిక్ చేయండి.
- జర్నల్ నెంబర్/హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి.
- పేపర్ 1, పేపర్ 2లో ఏదో సెలక్ట్ చేసుకోండి. తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
గతంతో పోల్చితే టీజీ టెట్ 2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2 కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. టెట్ పరీక్షకు మెుత్తంగా 1,95,181 మంది హాజరు అవ్వగా.. ఇందులో 65,605 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.
TG TET 2026 ఫలితాల ప్రకటన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో బోధనా స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత వారు పత్రాలను ధృవీకరించేందుకు వెళ్లాలి. దీని తర్వాత అభ్యర్థులకు వారి నియామకాన్ని నిర్ధారిస్తూ నియామక లేఖలు జారీ చేస్తారు.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్‌లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్లుగా పని చేయాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. అంతకుముందు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఏడాదిలో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు పెడుతున్నారు.
TS TET 2026 గురించి అదనపు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.inను సందర్శించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


