TG TET Results 2026 : టీజీ టెట్ ఫలితాలు ఎప్పుడు..? స్కోర్ కార్డు ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

టీజీ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు వచ్చే వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. స్కోర్ కార్డును https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Feb 7, 2026, 13:57:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ టెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది నిర్వహించిన టెట్ తో పోల్చితే… ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులే హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా.. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. తుది ఫలితాల విడుదలకు విద్యాశాఖ కూడా కసరత్తు కొనసాగిస్తోంది.

టెట్ ఫలితాలు 2026
టెట్ ఫలితాలు 2026

టీజీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

టీజీ టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం…. ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ తేదీల ప్రకారం చూస్తే… వచ్చే వారంలో టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

టెట్ స్కోర్ కార్డు ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

  1. అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని టీజీ టెట్ జనవరి - 2026 ఫలితాలపై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి హాల్ టికెట్, పేపర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ టెట్ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్(స్కోర్ కార్డు) కాపీని పొందవచ్చు.

ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరయ్యారు.

టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో టెట్ స్కోర్ కు వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలకు భారీ సంఖ్యలోనే టీచర్ అభ్యర్థులు హాజరవుతుంటారు.

ఇక ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్లుగా పని చేయాలంటే.. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కాబట్టి టెట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. గతంలో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఏడాదిలో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు జారీ చేసి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More