TG TET 2026 : టీజీ టెట్ అభ్యర్థులకు కొత్త అప్డేట్ - మీకోసమే 'మ్యాప్ లింక్స్'… ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే సెంటర్ల విషయంలో అభ్యర్థుల ఎదుర్కొనే ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా విద్యాశాఖ సరికొత్త సేవలను తీసుకొచ్చింది. సెంటర్ కు ఈజీగా వెళ్లేందుకు మ్యాప్ లింక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణ టెట్ - 2026 పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 97 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రాథమిక కీలు, ఫైనల్ కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువస్తారు.

కొన్నిచోట్ల పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై విద్యాశాఖకు పలువురు నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం… మ్యాప్ లింక్స్ ను తీసుకువచ్చింది. ఈ లింక్ పై క్లిక్ చేసి… ఈజీగా సంబంధిత సెంటర్ కు చేరుకోవచ్చు.
టీజీ టెట్ సెంటర్ మ్యాప్ లింక్స్ - ఇలా చూడండి
- టీజీ టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లండి
- హోం పేజీలోని సెంటర్ మ్యాప్స్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ 97 సెంటర్ల పేర్లు కనిపిస్తాయి. వీటి పక్కనే సంబంధిత మ్యాప్ లింక్ ఉంటుంది.
- మీ సెంటర్ పేరు పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేస్తే సెంటర్ లోకేషన్ మ్యాప్ ఓపెన్ అవుతుంది.
- ఈ వివరాల ఆధారంగా సులభంగా అభ్యర్థులు సులభంగా పరీక్షా కేంద్రానికి చేరుకునే వీలు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను టెట్ పరీక్షలకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు.
టీజీ టెట్ - 2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదలవుతాయని విద్యాశాఖ పేర్కొంది.ఈ ఫలితాలను కూడా https://tgtet.aptonline.in/tgtet / వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

