CTET Admit Card 2026 : సీ టెట్ అడ్మిట్ కార్డులు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
సెంట్రల్ టెట్ -2026 హాల్ టికెట్లు(అడ్మిట్ కార్డు) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్ - 2026 ఫిబ్రవరి సెషన్)కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://ctet.nic.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది.

రెండు షిఫ్టుల్లో సీ - టెట్ పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
సీటెట్ హాల్ టికెట్లు - డౌన్లోడో ఇలా చేసుకోండి
- ముందుగా https://ctet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని డౌన్లోడ్ అడ్మిట్ కార్డు - సీటెట్ 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్(అడ్మిట్ కార్డు) కాపీని పొందవచ్చు.
సీ టెట్ అడ్మిట్ కార్డులో ఏమైనా తప్పులు దొర్లితే ముందుగానే సరి చేసుకోవాలి. పేరు, ఫొటో, సంతకంతో పాటు ఇతర వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే సీ-టెట్ అధికారులను సంప్రదించాలి. అధికారిక వెబ్ సైట్ ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు.
సీటెట్ క్వాలిఫై అయితే… దేశవ్యాప్తంగానూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టీచర్ గా పని చేసేందుకు సీటెట్ అవసరం. రాష్ట్రాల్లో కూడా టెట్ పరీక్ష పాస్ కావటం తప్పనిసరి కాబట్టి… సీటెట్ రాసేందుకు చాాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచి సీటెట్ రాసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
- సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు.
- పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు.
- ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
- సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీకి 150 మార్కులకు గాను కనీసం 90 మార్కులు (60 శాతం), ఎస్సీ, ఎస్టీలకు 150 మార్కులకు 82 మార్కులు (55 శాతం) రావాలి. సీటెట్ పరీక్ష స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి సీ- టెట్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

