TG TET Applications 2026 : నేటి నుంచి తెలంగాణ టెట్ దరఖాస్తులు ప్రారంభం - నోటిఫికేషన్ వివరాలివే

TG TET Applications 2026 : ఇవాళ్టి నుంచి టీజీ టెట్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఈనెల 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు పరీక్షలు జరుగుతాయి.

Published on: Apr 15, 2026, 05:13:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Teacher Eligibility Test 2026 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి (ఏప్రిల్ 15) నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

టీజీ టెట్ నోటిఫికేషన్ (image istock)
టీజీ టెట్ నోటిఫికేషన్ (image istock)

టీజీ టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు, సిలబస్ తో పాటు అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో ఉంటాయి.

జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు అయితే ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.

టీజీ టెట్ 2026 - దరఖాస్తు విధానం :

  1. ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది.
  4. మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ టెట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:

  • దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
  • పరీక్ష తేదీలు - జూన్ 15, 2026 నుంచి జూన్ 30, 2026 మధ్య జరుగుతాయి.
  • టెట్ ఫలితాల వెల్లడి: జూలై 28 నుంచి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది.

టీజీ టెట్ ప్రధానంగా రెండు పేపర్లుగా ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More