AP TET DSC 2026 : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే

ఏపీలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మరో టెట్ ప్రకటన కూడా రావొచ్చని తెలుస్తోంది.

Published on: Feb 12, 2026, 16:29:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాదిలోనే ఏపీలో మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.15 వేల మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాలను కూడా అందజేశారు. ప్రస్తుతం వారంతా కూడా విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా... మిగిలిపోయిన పోస్టులతో పాటు రిటైర్మెంట్ ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇదే విషయంపై గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది.

త్వరలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ (image source istock)
త్వరలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ (image source istock)

గతేడాది రిక్రూట్ చేసిన మెగా డీఎస్సీలో భాగంగా దాదాపు 400కుపైగా పోస్టులు మిగిలాయి. వీటితో పాటు కొత్తగా ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి డీఎస్సీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా విద్యాశాఖ వివరాలను సేకరించినట్లు తెలిసింది. అయితే వచ్చే వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో.... పక్కాగా ఖాళీల లెక్కలు తీసుకొని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యే పనిలో ఉంది.

తాజా అప్డేట్ ఇదిగో…

తాజాగా ఏపీ టెట్, డీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేజీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని డిస్ ప్లే అవుతుంది. దీనికితోడు స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ సిలబస్ ను కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక పీడీఎఫ్ ను వెబ్ సైట్ లో ఉంచారు.

ఇప్పటికే ఏపీ టెట్ ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. పైగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్... గతేడాది అక్టోబర్ లో ఓ ప్రకటన కూడా చేశారు. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో చాలా మంది టీచర్ ఉద్యోగ అభ్యర్థులు... డీఎస్సీపై ఆశలు పెంచుకున్నారు.

అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఖాళీలపై ఓ క్లారిటీకి రానున్నారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కనుక జారీ అయితే... ఏప్రిల్, మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు స్పెషల్‌ డీఎస్సీలో 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి లభించింది.ఈ పోస్టుల భర్తీపై కూడా విద్యాశాఖ ఫోకస్ పెట్టింది.

ఇక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ రావొచ్చు. ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం టెట్ నిర్వహించిన తర్వాతనే…. డీఎస్సీ ప్రకటన ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ జారీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది…!

వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చే విషయాన్ని కూడా ఏపీ విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇంగ్లీష్ ఫ్రొఫిషియెన్సీ టెస్టుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టులు కూడా నిర్వహించాలని యోచిస్తోంది.ఇంగ్లీష్ మీడియం బోధనలో ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా... పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అందించవచ్చని విద్యాశాఖ లెక్కలు వేస్తోంది. వీటి విషయంలో క్లారిటీ రావాలంటే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే..!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More