OU PhD Notification 2026 : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ఈనెల 20 నుంచి దరఖాస్తులు
Osmania University PhD Notification 2026 : ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 సంవత్సరానికి గాను కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు మే 20 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Osmania University PhD Notification 2026 : స్మానియా విశ్వవిద్యాలయం (OU) లో పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ (Ph.D.) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి…. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ కేటగిరీ-1 కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యుజీసీ (UGC), సీఎస్ఐఆర్ (CSIR), ఐసీఎంఆర్ (ICMR), ఐసీఏఆర్ (ICAR), డీబీటీ (DBT), ఇన్‌స్పైర్ (INSPIRE), ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ (NFSC) మరియు ఎన్‌ఎఫ్‌ఎస్‌టీ (NFST) వంటి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా జేఆర్‌ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ , ఫీజు చెల్లింపుల ప్రారంభం : 20 మే 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 10 జూన్ 2026
- ఇంటర్వ్యూల నిర్వహణ (తాత్కాలిక తేదీ) : 18 జూన్ 2026 నుంచి ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు ఈ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచార బ్రోచర్, పీహెచ్‌డీ గైడ్‌లైన్స్, నిబంధనల వివరాలను మే 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్లు అయిన www.osmania.ac.in లేదా www.ouadmissions.com లలో సందర్శించి తెలుసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

