ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు
తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసింది. ఉన్నత విద్యా శాఖ ద్వారా పరిపాలనా అనుమతి జారీ అయింది. ఉన్నత విద్యా శాఖ ఈ మొత్తానికి పరిపాలనా ఆమోదం తెలిపింది, ఈ నిధులు ఓయూ క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగుదల కోసం మాత్రమే ఉద్దేశించినవని ప్రభుత్వం పేర్కొంది. మంజూరైన మొత్తాన్ని వినియోగించుకోవడానికి తదుపరి చర్యలు ప్రారంభించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వు జారీ అయ్యాయి.

యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. హాస్టళ్ల ఆధునీకరణ, అకడమిక్ బ్లాక్స్ నిర్మాణం, విద్యార్థుల సౌకర్యాలు, ఇతర పనులకు ఈ నిధులను ఉపయోగిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఓయూకి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేసినట్టుగా తెలిపారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వరాష్ట్ర ఆకాంక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం బలంగా వినిపించిందని గుర్తు చేశారు.
'భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఓయూకు వచ్చాను. గతంలో ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉంది. మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొందరు నాతో అన్నారు. ధైర్యంతో కాదు.. విద్యార్థుల గుండెల నిండా ఉన్న అభిమానంతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చాను. ప్రసంగాలు చదవుకుని కాదు.. నా మనసులో ఉన్నది చెప్పాలని ఇక్కడకు వచ్చాను. మీరు ఇచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాను. విద్యార్థులకు మా ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతో ఇక్కడి వచ్చా.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


