UGC NET ఫలితాలు విడుదల: మీ స్కోర్ కార్డ్ ఇలా చెక్ చేసుకోండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET డిసెంబర్ 2025 సెషన్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్ కార్డ్, కటాఫ్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) రాసిన అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 4న UGC NET ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను మరియు స్కోర్ కార్డ్‌లను నెట్ అధికారిక పోర్టల్‌లో చూసుకోవచ్చు.

UGC NET డిసెంబర్ సెషన్ పరీక్షలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరిగాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు) ఈ పరీక్షలు నిర్వహించారు.
ముఖ్యమైన వివరాలు:
పరీక్ష ముగిసిన తర్వాత, జనవరి 14న ప్రాథమిక సమాధాన పత్రాన్ని (Provisional Answer Key) విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 17 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో అభ్యంతరానికి అభ్యర్థులు రూ. 200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, తుది ఫలితాలను ఇప్పుడు అందుబాటులో ఉంచారు.
UGC NET ఫలితాలు చెక్ చేయడం ఎలా?
మీ స్కోర్ కార్డ్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సూచనలు పాటించండి:
- ముందుగా UGC NET అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపించే 'UGC NET Result 2025' లింక్‌పై క్లిక్ చేయండి.
- వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ లాగిన్ వివరాలు (అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ) ఎంటర్ చేయండి.
- వివరాలు సమర్పించిన (Submit) తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- మీ మార్కులు, అర్హత వివరాలను తనిఖీ చేసుకుని స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.
అభ్యర్థులు కటాఫ్ వివరాలను కూడా వెబ్‌సైట్‌లోని డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


