AP ICET 2026 : ఏపీ ఐసెట్ దరఖాస్తులు ప్రారంభం - అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ ఐసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఫైన్ లేకుండా మార్చి 2వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 2వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

Published on: Feb 14, 2026 3:37 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ - 2026 నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

ఏపీ ఐసెట్ (image source istock)
ఏపీ ఐసెట్ (image source istock)

ఏపీ ఐసెట్ 2026 - అప్లికేషన్ తేదీలు

ఈ ఏడాది ఏపీ ఐసెట్ - 2026 పరీక్షను ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. రూ. 1000 ఫైన్ తో మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ. 2 వేల ఫైన్ తో అయితే మార్చి 12 వరకు, రూ. 4 వేల ఫైన్ తో మార్చి 17 వరకు ఛాన్స్ ఉంది. రూ. 10 వేల ఆలస్య రుసుంతో మార్చి 18 నుంచి 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

మే 2న ఐసెట్ ఎగ్జామ్…

ఆన్ లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం మార్చి 23వ తేదీ నుంటుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 2వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 25 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మే 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి. మే 7వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 16వ తేదీన ఏపీ ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ ఐసెట్ అప్లికేషన్ ప్రాసెస్…

  1. ముందుగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  3. హోంపేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
  4. ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  5. సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
  6. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  7. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
  8. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుంది.

ఏపీ ఐసెట్ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా ఐసెట్ కు మంచి స్పందన వస్తోంది. సీట్లకు కూడా చాలా డిమాండ్ ఉంటోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More