AP ICET 2026 Results : ఏపీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

AP ICET Rank Card Download : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ (AP ICET-2026) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఈ పరీక్షలో 91.41 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడకు చెందిన వైష్ణవి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు.

Published on: May 16, 2026, 16:53:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP ICET Rank Card Download : ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 (AP ICET) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శనివారం ఈ ఫలితాలను ఎక్స్ వేదికగా(ట్విట్టర్) విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలో ప్రతిభ చాటిన టాప్ రాంకర్లను ఆయన అభినందించారు.

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల (istock image )
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల (istock image )

ఏపీ ఐసెట్ 2026 ఫలితాల వివరాలు:

ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,198 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో అత్యధికంగా 21,205 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఐసెట్‌లో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.

ఈసారి ఏపీ ఐసెట్ -2026 ఫలితాలలో బాలికలు, రాయలసీమ, కోస్తాంధ్ర విద్యార్థులు మంచి మార్కులతో టాప్-10లో నిలిచి సత్తా చాటారు. కాకినాడకు చెందిన వైష్ణవి అనే విద్యార్థిని ఏకంగా 166.094 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ (1వ) ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.

టాప్ 10 ర్యాంకర్లు…

  1. వైష్ణవి (166.094) కాకినాడ
  2. బి. వెంకట సిద్ధార్థ యాదవ్‌ (164. 8896) వైఎస్‌ఆర్‌ కడప
  3. షేక్‌ ఖాజాలియాఖత్‌ (161.7441) నెల్లూరు
  4. పి. రామచంద్రా రెడ్డి (160.803) తిరుపతి
  5. జాడ నాని మహేష్‌బాబు (159.6669) తూర్పుగోదావరి
  6. ఆర్‌.తారక సాయి కృష్ణ కాంత్‌ (157.4799) పశ్చిమగోదావరి
  7. బి. ప్రత్యూష (157.124) అనకాపల్లి
  8. పి.ఉష (155.8895) తూర్పుగోదావరి
  9. నల్లపాటి హర్షవర్ధన్‌ (155.3233) అనంతపురం
  10. తురక మల్లికార్జున (155.2048) అన్నమయ్య

ఏపీ ఐసెట్ ఫలితాలు - రిజల్ట్, ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ ను సందర్శించండి.
  2. హోం పేజీలో కనిపించే 'Results' లేదా 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
  4. వివరాలు సమర్పించిన తర్వాత మీ ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

ఇక ఏపీ ఐసెట్ 2026 ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

  1. మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
  2. వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  3. వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
  4. ఆ తర్వాత "ఏపీ ఐసెట్ ఫలితాలు 2026" పై క్లిక్ చేయండి.
  5. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఏపీ ఐసెట్ -2026 ఫలితాల విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులు, హాల్ టికెట్లు మరియు విద్యార్హత ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అప్డేట్స్ కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More