AP ICET Hall Ticket 2026 : ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల - ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Ticket 2026 : ఏపీ ఐసెట్ 2026 హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 

Published on: Apr 16, 2026 11:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP ICET 2026 Hall Ticket Download : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ - 2026 హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 2వ తేదీన ఏపీ ఐసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ఏపీ ఐసెట్ 2026 హాల్ టికెట్లు
ఏపీ ఐసెట్ 2026 హాల్ టికెట్లు

ఏపీ ఐసెట్ 2026 - హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ :

  1. మొదట ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ ( https://cets.apsche.ap.gov.in ) ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్ , క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
  4. వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి.
  5. మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అందులో మీ పేరు, ఫోటో, సంతకం, పరీక్ష కేంద్రం చిరునామా, పరీక్ష సమయం వంటి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ఐసెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ) తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.

మే 2న ఐసెట్ ఎగ్జామ్ …

మే 2వ తేదీన ఏపీ ఐసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 25 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.

మే 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి. మే 7వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 16వ తేదీన ఏపీ ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ ఐసెట్ - 2026 పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ చేపట్టి… సీట్ల భర్తీని పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఈ విషయంపై ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More