AP Inter Supplementary Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
AP Inter Supplementary Exam Fee 2026 : ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఆయా విద్యార్థులు ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇదే చివరి అవకాశమని…. విద్యార్థులు వారి కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
AP Inter Supplementary Exam Fee 2026 : విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 27 చివరి తేదీ కావాల్సి ఉండగా…. ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.

ఇదే చివరి అవకాశం….
ఫీజు చెల్లింపు గడువు పొడిగింపుపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గడువును ఏప్రిల్ 30 వరకు పెంచినట్లు తెలిపింది. అయితే…. ఈ తేదీ తర్వాత మళ్లీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ కళాశాల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి ఫీజు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల ద్వారానే నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్లు మాత్రమే కాకుండా రెండవ సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేకపోయారో లేదా మార్కులు పెంచుకోవాలని (Improvement) భావిస్తున్నారో, వారందరూ ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా రుసుము చెల్లించడంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాలల యాజమాన్యాలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
సప్లిమెంటరీ పరీక్ష తేదీలు….
ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. ఈసారి సెకండియర్ విద్యార్థులకు కూడా అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

