ఇంటర్ కాలేజీలకు హాఫ్ డే క్లాసులు.. ఎప్పటి నుంచి? టైమింగ్స్ ఏంటి?

AP Inter Colleges : ఇంటర్ కాలేజీలకు హాఫ్ డేపై ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ప్రకటన చేసింది. అలాగే క్లాసుల ఏ టైమ్ నుంచో వెల్లడించింది.

Published on: Mar 30, 2026, 17:18:21 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా బోర్డు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు తెలియజేసింది. రాష్ట్రంలో జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీఎస్, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు మొదలైన వాటి ప్రిన్సిపాల్స్‌కు ఈ కాలంలో తమ కళాశాలల వారీగా టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఇంటర్ కాలేజీలకు హాఫ్ డే క్లాసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్ కాలేజీలకు హాఫ్ డే క్లాసులు(ప్రతీకాత్మక చిత్రం)

అన్ని కళాశాలల యాజమాన్యాలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలోని తమ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ప్రాంతీయ తనిఖీ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు, జిల్లా వృత్తి విద్యా అధికారులందరికి తెలిపింది.

ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ విద్యార్థులకు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. అంటే.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి క్లాసులు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలండర్‌ను విడుదల చేసింది.

ఈ అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మెుత్తం 232 రోజులు జూనియర్ కాలేజీలు పని చేస్తాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై ఇంటర్ బోర్డు కొన్ని నిబంధనలు పెట్టింది. పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారంటీపై ప్రచారం చేయకూడని స్పష్టం చేసింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని చెప్పడమే కాకుండా.. కాలేజీల నడుమ అనారోగ్యకరమైన పోటీని సృష్టించేలా ఉంటుందని అధికారులు చెప్పారు.

నిబంధనల ప్రకారం జూనియర్ కళాశాలలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాల పంపిణీ, గోడల మీద రాతలు వంటి చేయకూడదు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి, సీబీఎస్‌ఈ విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్‌ పరీక్షల తర్వాత కూడా ఏప్రిల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ప్లాన్ చేసింది ఇంటర్ బోర్డు.

ముఖ్యమైన తేదీలు

  • ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • జూన్‌ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం
  • అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు
  • దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 20 వరకు
  • హాఫ్ ఇయర్లీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు
  • జనవరి 9 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
  • జనవరి 19 నుంచి 23 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరి లేదా మార్చిలో థియరీ పబ్లిక్‌ పరీక్షలు
  • 2026-27 అకడమిక్ ఇయర్ చివరి వర్కింగ్‌ డే మార్చి 18
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More