మీరు చేరే కాలేజీ ఫీజు మారిందా? ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులు, ఇందులో హయ్యెస్ట్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ ఫీజులను పెంచేందుకు అనుమతి ఇవ్వనుంది. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం ఫీజులను తగ్గించేందుకు నిర్ణయించింది.

Published on: Feb 20, 2026, 07:36:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు మారనున్నాయి. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రతిపాదన ప్రకారం, రాబోయే విద్యా సంవత్సరానికి కనీసం 63 కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు పెరుగుతాయి. 70 కళాశాలల్లో ఎటువంటి మార్పులు ఉండవు, 19 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తగ్గిస్తారు. ఉన్నత విద్యా రంగంలో ఫీజు వసూలును నియంత్రించడానికి, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులు
ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులు

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT) రూ.1.83 లక్షలతో అత్యధిక ఫీజును ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫీజులను రూ. 62,000 వరకు పెంచుకోవడానికి అనుమతి ఉంది, అయితే ఇతర కళాశాలలు స్వల్పంగా మాత్రమే పెరుగుతాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. నారాయణమ్మ కళాశాల ఫీజును 2022లో రూ. 1.22 లక్షల నుండి రూ. 1 లక్షకు తగ్గించారు. ఈసారి గణనీయమైన పెంపును అమలు చేయడానికి అనుమతి ఉంది.

గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వారి ఇంజనీరింగ్ ఫీజులలో వరుసగా రూ.43,000, రూ.35,100 తగ్గించారు. సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫీజులను రూ.23,800కి తగ్గించారు.

ఫీజులు తగ్గించిన ఇతర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల, విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నాయి. ఫీజులు తగ్గించిన మొత్తం 19 కళాశాలల్లో 15 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందినవి.

కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజులను గణనీయంగా పెంచింది. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫీజులను రూ.62,000 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించగా, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు గోకరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరుసగా రూ.35,000, రూ.30,500 పెంచాయి. ఫీజు స్థిరీకరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన తెలంగాణ అడ్మిషన్, ఫీజు నియంత్రణ కమిటీ కొత్త ఫీజు నిర్మాణాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

విద్యా సంవత్సరం ముగింపు దగ్గర పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేయకపోవడంతో, కళాశాలలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. కేసును విచారణ జరుగుతోంది. ఫీజు పెంపుపై అధికారిక సమాచారం త్వరలో వస్తుంది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు ఫీజు సవరణ వర్తిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫీజు అమలులోకి వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More