ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ప్రాక్టికల్స్ హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సంబంధిత విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా పొందవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. సంబంధిత విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా వీటిని పొందవచ్చని పేర్కొన్నారు.

ఏపీ ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్‌టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్
- విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐపీఈ ప్రాక్టికల్ పరీక్షల లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా 9552300009 వాట్సప్ నంబర్‌కు Hi అని మెసేజ్ సెండ్ చేయాలి. ‘ఎడ్యుకేషన్ సర్వీసెస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
జనరల్ విభాగాల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రెండు విడతల్లో వీటిని పూర్తి చేస్తారు. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
మరోవైపు ఏపీ ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు. ప్రాక్టీకల్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత థియరీ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1
- ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1
- మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ
- మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1
- మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1,
- మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1
- మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
- మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1
- మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1
- మార్చి 21 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
- మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2
- ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2
- మార్చి 4 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
- మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
- మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి
- మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
- మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2
- మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
- మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2
- మార్చి 23 - సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

