AP Inter Results 2026 : విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ ఉదయం 10:31 గంటలకు ఫలితాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు రికార్డు స్థాయి ఫలితాలను సాధించాయి.
- ప్రథమ సంవత్సరం: ప్రభుత్వ కళాశాలల్లో 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత 12 ఏళ్లలో ఇదే అత్యధికం.
- ద్వితీయ సంవత్సరం: 68 శాతం ఉత్తీర్ణత సాధించి… గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రతిభ కనబరిచారు. గత 12 ఏళ్లలో లేనంతగా ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
- resultsbie.ap.gov.in
- bie.ap.gov.in
- results.apcfss.in
వాట్సాప్ లో ఇంటర్ ఫలితాలు…
- ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ సేవల ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు.
- మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
- వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
- మెనూలో 'Education Services' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఆ తర్వాత 'Download Intermediate Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
ఫలితాల్లో ఆశించిన ఫలితం రాని విద్యార్థులు ఏమాత్రం కుంగిపోవద్దని విద్యావేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. "ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు అధైర్యపడకండి. దీనిని ఒక అడ్డంకిగా కాకుండా… భవిష్యత్తులో మరింత బలంగా తిరిగి రావడానికి ఒక ప్రేరణగా తీసుకోండి" అని భరోసా ఇస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు విద్యార్థులకు నైతిక మద్దతుగా నిలవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఫలితాల్లో ఆశించిన ఫలితం రాని విద్యార్థులు ఏమాత్రం కుంగిపోవద్దని విద్యావేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. "ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు అధైర్యపడకండి. దీనిని ఒక అడ్డంకిగా కాకుండా… భవిష్యత్తులో మరింత బలంగా తిరిగి రావడానికి ఒక ప్రేరణగా తీసుకోండి" అని భరోసా ఇస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు విద్యార్థులకు నైతిక మద్దతుగా నిలవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}