Andhra Pradesh Intermediate Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2026పై కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ ఫలితాలు 2026 కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏప్రిల్ 18 లేదా 19న విడుదలయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. ఫలితాల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్‌కు సంబంధించిన ప్రాసెస్ పూర్తి కానుంది.

అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే చూసేందుకు: హాల్ టికెట్ నెంబర్ రెడీగా ఉంచుకోండి. ఒక్కసారిగా విద్యార్థులు అందరూ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌కు రావొచ్చు, దీంతో సర్వర్ స్లో ఉండొచ్చు. ఫలితాల ప్రకటన కోసం ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ప్రకటించనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టులతో పాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంచుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు బయోలజీని, బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్‌తో పాటు ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. కోర్సులోని రెగ్యూలర్ సబ్జెక్ట్ ఫలితాలనే బోర్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. వీటి ఫలితాలను సాధారణంగానే ప్రకటించనుంది.
అయితే ఆప్షన్‌గా ఎంచుకున్న సబ్జెక్ట్ రాత పరీక్ష ఫలితాలను మాత్రం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచడం లేదా కాలేజీలకు పంపిస్తారని సమాచారం. దీనిపై ఫలితాల ప్రకటన తర్వాత క్లారిటీ వస్తుంది.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?
ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్ రిజల్ట్, సెకండిర్ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.
మనమిత్ర వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోండి.
- మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయాలి.
- రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి.
- తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి అని కనబడుతుంది.
- ఫలితాల డౌన్లోడ్ ఆప్షన్ యాక్టివ్ అయిన తర్వాత మీ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
- మీ వాట్సప్ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.