ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(AP Inter Advanced Supplementary 2026 Results) పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాల విడుదల చేసింది.

మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారితో పాటు, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల రిజల్ట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చెక్ చేయాలి?
మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపించే 'AP Inter Supplementary Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి (ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అనేది ఎంచుకోవాలి).
మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత Get Result బటన్‌పై క్లిక్ చేస్తే మీ మార్కుల స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ఆ మార్కుల షీట్‌ను ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా మీరు ఫలితాలు చూసుకోవచ్చు.
'విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా వాట్సాప్ 'మనమిత్ర' (9552300009) ద్వారా తెలుసుకోవచ్చు. విజయవంతంగా ఉత్తీర్ణులైన వారికి, పట్టుదల, కఠిన శ్రమతో మార్కులు పెంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు. మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీ విద్యా ప్రయాణంలో మీకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటున్నాను.' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రథమ సంవత్సర ఫలితాలు
- మొత్తం 2,29,034 మంది అభ్యర్థులలో 1,35,435 మంది (59 శాతం) తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు.
- మొత్తం 1,09,003 మంది అభ్యర్థులలో 42,379 మంది (39 శాతం) ఉత్తీర్ణులై, తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
ద్వితీయ సంవత్సర ఫలితాలు
- మొత్తం 91,303 మంది అభ్యర్థులలో 48,149 మంది (53 శాతం) తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు.
- మొత్తం 1,02,018 మంది అభ్యర్థులలో 57,327 మంది (56 శాతం) ఉత్తీర్ణులై, తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాలకు కలిపి దాదాపు 12.50 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియను ఇంటర్ బోర్డు అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసింది. జూన్ 15వ తేదీ నాటికే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం ముగిసిపోవడంతో, కేవలం మూడు రోజుల్లోనే డీకోడింగ్, మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసింది.
{{/usCountry}}ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాలకు కలిపి దాదాపు 12.50 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియను ఇంటర్ బోర్డు అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసింది. జూన్ 15వ తేదీ నాటికే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం ముగిసిపోవడంతో, కేవలం మూడు రోజుల్లోనే డీకోడింగ్, మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసింది.
{{/usCountry}}ఇప్పటికే ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒకవేళ మీరు వీటి కోసం ఫీజు కట్టినట్టైతే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను చూసుకోండి.