ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల.. ఇక్కడ నుంచి ఒక్క క్లిక్‌తో మీ స్క్రీన్‌పై రిజల్ట్
AP Inter Supply Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫలితాలను ఇక్కడ నుంచి ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(AP Inter Advanced Supplementary 2026 Results) పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాల విడుదల చేసింది.

మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారితో పాటు, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల రిజల్ట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చెక్ చేయాలి?
మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపించే 'AP Inter Supplementary Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి (ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అనేది ఎంచుకోవాలి).
మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత Get Result బటన్‌పై క్లిక్ చేస్తే మీ మార్కుల స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ఆ మార్కుల షీట్‌ను ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా మీరు ఫలితాలు చూసుకోవచ్చు.
'విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా వాట్సాప్ 'మనమిత్ర' (9552300009) ద్వారా తెలుసుకోవచ్చు. విజయవంతంగా ఉత్తీర్ణులైన వారికి, పట్టుదల, కఠిన శ్రమతో మార్కులు పెంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు. మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీ విద్యా ప్రయాణంలో మీకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటున్నాను.' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రథమ సంవత్సర ఫలితాలు
- మొత్తం 2,29,034 మంది అభ్యర్థులలో 1,35,435 మంది (59 శాతం) తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు.
- మొత్తం 1,09,003 మంది అభ్యర్థులలో 42,379 మంది (39 శాతం) ఉత్తీర్ణులై, తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
ద్వితీయ సంవత్సర ఫలితాలు
- మొత్తం 91,303 మంది అభ్యర్థులలో 48,149 మంది (53 శాతం) తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు.
- మొత్తం 1,02,018 మంది అభ్యర్థులలో 57,327 మంది (56 శాతం) ఉత్తీర్ణులై, తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.
ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాలకు కలిపి దాదాపు 12.50 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియను ఇంటర్ బోర్డు అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసింది. జూన్ 15వ తేదీ నాటికే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం ముగిసిపోవడంతో, కేవలం మూడు రోజుల్లోనే డీకోడింగ్, మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసింది.
ఇప్పటికే ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒకవేళ మీరు వీటి కోసం ఫీజు కట్టినట్టైతే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను చూసుకోండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


