...
...
Next Story

AP Inter Supply Results 2026 : నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకునే విధానం ఇలా!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

Updated on: Jun 18, 2026 05:39 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 పరీక్షల ఫలితాలు రానున్నాయి. జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటలకు ఇంటర్ బోర్డు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారితో పాటు, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుంది.

రికార్డు స్థాయిలో ముగిసిన మూల్యాంకనం

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాలకు కలిపి దాదాపు 12.50 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియను ఇంటర్ బోర్డు అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసింది. జూన్ 15వ తేదీ నాటికే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం ముగిసిపోవడంతో, కేవలం మూడు రోజుల్లోనే డీకోడింగ్, మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను సిద్ధం చేశారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింది పద్ధతి ద్వారా తమ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో కనిపించే 'AP IPASE Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి (ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అనేది ఎంచుకోవాలి).

మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) వివరాలను నమోదు చేయాలి.

ఆ తర్వాత 'Submit' లేదా 'Get Result' బటన్‌పై క్లిక్ చేస్తే మీ మార్కుల స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఫలితాలు విడుదలైన మొదటి కొన్ని నిమిషాల్లో సర్వర్లపై ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్ నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించడం మంచిది. ఈ సప్లిమెంటరీ ఫలితాల ఆధారంగానే విద్యార్థులకు పైచదువుల (ఉదాహరణకు: ఇంజనీరింగ్, డిగ్రీ కౌన్సిలింగ్స్) అడ్మిషన్ల ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుంది.

ఇప్పటికే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒకవేళ మీరు వీటి కోసం ఫీజు కట్టినట్టైతే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను చూసుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe