AP Inter Supplementary Results 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్ - ఈనెల 18న సప్లిమెంటరీ ఫలితాలు!

AP Inter Supplementary Results 2026 : ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌(మనమిత్ర) ద్వారా మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jun 16, 2026, 07:31:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Inter Supplementary Results 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 18వ తేదీన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి మొత్తం 12.50 లక్షల జవాబుపత్రాలు రాగా…. వాటి మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. ఈ ఫలితాల ప్రాసెసింగ్‌కు మరో రెండు రోజుల సమయం పటే అవకాశం ఉంది. దీంతో ఈనెల 18వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన వెంటనే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో సులభంగా చూసుకోవచ్చు.

  • resultsbie.ap.gov.in
  • bie.ap.gov.in
  • results.apcfss.in

వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో 'ఇంటర్ మొదటి సంవత్సరం' లేదా 'రెండో సంవత్సరం' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి. ఆపై విద్యార్థి తన హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కితే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మనమిత్ర' (Mana Mitra) వాట్సాప్ సేవల ద్వారా కూడా విద్యార్థులు ఇంటర్ ఫలితాలను నేరుగా మొబైల్‌లోనే పొందే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:

  1. మొదట మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
  2. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి, ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపాలి.
  3. వెంటనే చాట్‌బాక్స్ ఓపెన్ అయి కొన్ని ఆప్షన్లు చూపిస్తుంది. అందులో 'Education Services' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  4. అనంతరం స్క్రీన్‌పై కనిపించే 'Download Intermediate అడ్వాన్స్ Results' అనే లింక్ లేదా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  5. చివరగా మీ ఇంటర్ హాల్ టికెట్ నంబర్‌ను అక్కడ టైప్ చేసి సెండ్ చేస్తే చాలు, మీ మార్కుల మెమో వాట్సాప్ చాట్‌లోనే ప్రత్యక్షమవుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More