TG Inter Supply Results 2026 : ఇంటర్ మార్కుల మెమోపై కీలక అప్డేట్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు డెడ్‌లైన్
TG Inter Supply Results 2026 : తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. రికౌంటింగ్, పున:పరిశీలనకు బోర్డు అవకాశం కల్పించింది. అంతేకాదు ఇంటర్ మార్కుల మెమోపై కీలక అప్డేట్ కూడా ఇచ్చింది.
తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. మెుత్తం 398459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 68.71 ఉండగా.. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 47.70గా ఉంది. విద్యార్థులు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఫలితాలను చూసుకోవచ్చు. ఇక మార్కుల మెమోలు, రీకౌంటింగ్, పున:పరిశీలనపై ఇంటర్ బోర్డు అప్డేట్ ఇచ్చింది.

షార్ట్ మెమో
కళాశాల ప్రిన్సిపాల్‌లు తమ లాగిన్ ద్వారా విద్యార్థుల 'ఆన్‌లైన్ మార్కుల మెమోరాండం' (షార్ట్ మెమో)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:00 గంటల నుండి కళాశాల మార్కుల రిజిస్టర్లను (ట్యాబులేషన్ రిజిస్టర్లు) కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ (https://tgbie.cgg.gov.in) నుండి సాయంత్రం 5:00 గంటల తర్వాత 'ఆన్‌లైన్ మార్కుల మెమోరాండం' (షార్ట్ మెమో)ను డౌన్‌లోడ్ చేసుకుని, దాని కలర్ ప్రింటవుట్ తీసుకోవాలని సూచించింది బోర్డు.
ఇంకా మార్కుల మెమోరాండం ఫిజికల్ కాపీ ప్రత్యేకంగా పంపిణీ చేయరని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌లకు తెలియజేస్తున్నట్టుగా బోర్డు పేర్కొంది. బోర్డు నుండి (మార్కులతో కూడిన) ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం అందే వరకు విద్యార్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకుని తమ వద్ద భద్రపరచుకోవాలి.
తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి
ఆన్‌లైన్ మార్కుల మెమోరాండంలో ఏవైనా లోపాలు లేదా తేడాలు ఉంటే, ఫలితాలు వెలువడిన పది రోజులలోపు సంబంధిత ప్రిన్సిపాల్‌ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకురావాలి లేదా helpdesk-ie@telangana.gov.in అనే ఈమెయిల్ చిరునామాకు పంపాలి. ఈ గడువు తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించరు.
రీకౌంటింగ్, పున:పరిశీలన
జవాబు పత్రాల రీకౌంటింగ్, స్కాన్ చేసిన ప్రతిని అందించడం, పునఃపరిశీలన కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ లేదా పునఃపరిశీలన, స్కాన్ చేసిన కాపీ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు, BIE వెబ్‌సైట్ (https://tgbie.cgg.gov.in) లోని 'Student Online Services' ద్వారా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుమును చెల్లించాలి.
రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 100 చెల్లించాలి. జవాబు పత్రం స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం ఒక్కో పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును 12-06-2026 నుండి 18-06-2026 వరకు చెల్లించవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఈ ఆన్‌లైన్ సేవ నిలిపివేస్తారు. గడువు పొడిగింపు ఉండదు. గడువు ముగిసిన తర్వాత మాన్యువల్ (నేరుగా) దరఖాస్తులను సమర్పించడం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించరు. రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వరు.
విద్యార్థి రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న నిర్దిష్ట సబ్జెక్టు(ల)ను ఎంచుకోవాలి. వారి పూర్తి చిరునామా, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. అభ్యర్థులు తమ సొంత జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇతర అభ్యర్థుల స్కాన్ చేసిన కాపీని పొందడం నేరమని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. బోర్డు వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ నిర్వహించడానికి వీలుగా, అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


