AP EAPCET 2026 Results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై కసరత్తు - ఆ వెంటనే ఈఏపీసెట్ రిజల్ట్స్..!

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాతనే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలను ప్రకటించనున్నారు. 

Published on: Jun 14, 2026, 06:18:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఈఏపీసెట్ (EAPCET) ఫలితాల విడుదలకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రెండు కీలక పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలోనే విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఏపీ ఈఏపీసెట్ 2026
ఏపీ ఈఏపీసెట్ 2026

ఈనెల 18లోపు సప్లిమెంటరీ ఫలితాలు…

రాష్ట్రంలో మే 21 నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి, రెండో ఏడాది విద్యార్థుల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ థియరీ పరీక్షలు జూన్ 5వ తేదీతో విజయవంతంగా ముగిశాయి. అనంతరం ప్రాక్టికల్ పరీక్షలను ఆయా జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో జూన్ 7 నుంచి జూన్ 11 వరకు నిర్వహించారు. దీంతో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 18వ తేదీలోపే పూర్తి చేసి… ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అద్భుతమైన అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ ఫలితాలను ప్రకటించిన తర్వాత…. ఈఏపీసెట్ రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం… ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 18వ తేదీలోపు విడుదల చేసే అవకాశాలున్నాయి. ఏపీ ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ రాసిన విద్యార్థుల మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ వెయిటేజీని లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి… ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే.. అదే జూన్ మూడో వారంలోనే ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది ఈఏపీసెట్ పరీక్షలు రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.

  • ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు నమోదైంది.
  • వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను కూడా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు.

ప్రాథమిక సమాచారం మేరకు… ఈఏపీసెట్ -2026 ఫలితాలు వచ్చిన వెంటనే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More