AP EAPCET 2026 : మే 12 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏపీ ఈఏపీసెట్ 2026 ప్రారంభం

AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని.. సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్లాలి.

Published on: May 11, 2026, 14:36:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా మే 12, 13, 14, 15, 18, 19, 20 తేదీలలో నిర్వహించ తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(A.P. EAPCET)-2026 నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పూర్తి చేసింది.

ఏపీ ఈఏపీసెట్ 2026
ఏపీ ఈఏపీసెట్ 2026

ఈ ఏడాది మొత్తం 3,55,011 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని మండలి కార్యదర్శి బి.తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU)-కాకినాడ నిర్వహిస్తుండగా, ఎన్. మోహన్ రావు కన్వీనర్‌గా ఉన్నారు.

ఉదయపు విడత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 7:30 గంటల నుండి, మధ్యాహ్నపు విడత పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 12:30 గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

నిర్ణీత సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని మోహన్ రావు స్పష్టం చేశారు. పరీక్షా గదిలోకి హాల్ టికెట్, దరఖాస్తు పత్రం, చెల్లుబాటయ్యే ఫోటో గుర్తింపు కార్డు, బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గ్యాడ్జెట్‌లను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధం ఉందని గుర్తుచేశారు.

A.P. EAPCET-2026 పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని 48 పట్టణాల్లో మొత్తం 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్షా కేంద్రం కచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవచ్చు.

AP EAPCET 2026 - హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా

ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in సందర్శించాలి.

హోం పేజీలో 'AP EAPCET - 2026' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

అక్కడ కనిపించే 'Download Hall Ticket' లింక్‌ను ఎంచుకోవాలి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

వివరాలు సమర్పించగానే మీ హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More