TG ICET 2026 Hall Tickets : టీజీ ఐసెట్ హాల్‌టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్, పరీక్ష తేదీల వివరాలు ఇవే!
TG ICET 2026 Hall Tickets : తెలంగాణ ఐసెట్ (TG ICET) 2026 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… వారి రిజిస్ట్రేషన్ నంబర్ తో హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.
TG ICET 2026 Hall Tickets : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ (TG ICET) 2026 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. అభ్యర్థుల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

కాకతీయ విశ్వవిద్యాలయం (వరంగల్) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మే 13, 14 తేదీల్లో పూర్తి చేస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. సెషన్ 3 పరీక్ష మే 14, 2026 న సింగిల్ షిఫ్ట్ లో జరుగుతుంది.
టీజీ ఐసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ను సందర్శించండి.
- హోం పేజీలో కనిపించే 'Download Hall Ticket' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number), పుట్టిన తేదీ (Date of Birth),క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నంబర్ వివరాలను నమోదు చేయండి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Download Hall Ticket' బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు అభ్యర్థులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. హాల్‌టికెట్‌పై మీ పేరు, ఫోటో, సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే హెల్ప్ డెస్క్ అధికారులను సంప్రదించాలి.
టీజీ ఐసెట్ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 50 మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కుల నిర్ణయం వర్తించదు. ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.
ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా ఐసెట్ కు మంచి స్పందన వస్తోంది. సీట్లకు కూడా చాలా డిమాండ్ ఉంటోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

