AP LAWCET 2026 Results : ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ నుంచి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేయండి
AP LAWCET 2026 Resutls : ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్ చూసుకునేందుకు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ ఉంది.
APSCHE తన అధికారిక వెబ్‌సైట్‌లో AP LAWCET, AP PGLCET 2026 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పుడు తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అర్హత వివరాలను సరిచూసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఏపీ లాసెట్-2026' (AP LAWCET), 'ఏపీ పీజీఎల్‌సెట్' (AP PGLCET) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) విడుదల చేసింది. ఈ ఏడాది మే 4వ తేదీన ఏపీ లాసెట్ పరీక్ష నిర్వహించారు. ఏపీ లాసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఏపీ లాసెట్ ఫలితాన్ని చూసుకోగలరు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను క్రింది విధానం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మొదట అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో కనిపించే 'AP LAWCET - 2026 Results' లేదా 'Rank Card' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్ టికెట్ నంబర్ వివరాలను నమోదు చేయండి.
- స్క్రీన్‌పై మీ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డును ప్రింట్ తీసి ఉంచుకోండి.
ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి.
రాష్ట్రవ్యాప్తంగా 23,996 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. 19,197మంది అర్హత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలు వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, అలాగే ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ లేదా జులై నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


