AP LAWCET 2026 : ఏపీ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఇదే
AP LAWCET 2026 : ఏపీ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగించారు. గతంలో మార్చి 12వ తేదీ వరకే అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉండేది.
ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ లాసెట్) 2026 దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఫిబ్రవరి 12వ తేదీన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మెుదలైన విషయం తెలిసిందే. మార్చి 12వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా మెుదట నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దానిని మార్చి 20వ తేదీ వరకు పొడిగంచారు.

ఏపీ లాసెట్ - 2026 పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి మూడేళ్ల లా, ఐదేళ్ల లా, పీజీ లా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్ధులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ ప్రవేశ పరీక్ష మే 4వ తేదీన జరుగుతుంది. కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు లా డిగ్రీ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులకు పొడిగించిన చివరి తేదీ - 2026 మార్చి 20
- రూ.1000 ఫైన్‌తో దరఖాస్తు చివరి తేది - 24 మార్చి 2026.
- రూ.2000 ఫైన్‌తో దరఖాస్తు చివరి తేది - 28 మార్చి 2026.
- రూ.4000 ఫైన్‌తో దరఖాస్తు చివరి తేది - 01 ఏప్రిల్ 2026.
- రూ.10000 ఫైన్‌తో దరఖాస్తు చివరి తేది - 06 ఏప్రిల్ 2026.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 08 ఏప్రిల్ 2026.
- హాల్‌టికెట్ డౌన్లోడ్ - 20 ఏప్రిల్ 2026.
- లాసెట్ ఎగ్జామ్ తేదీ - 4 మే 2026.
- ప్రాథమిక కీ విడుదల - 7 మే 2026 .
- అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ -09-05-2026
- ఫైనల్ కీ-16-05-2026
- ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల - 18 మే 2026.
- అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/
ఏపీ లాసెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- అప్లికేషన్ ఫీజు ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లింపు వివరాల ఆధారంగా అప్లికేషన్ ఫారమ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ఇక్కడ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేయాలి.
- అభ్యర్థి ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే ఏపీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


